ఆ సమయంలో ఏం జరిగింది..?

ప్రీతి సూసైడ్ అటెమ్ట్ కు ముందు……?

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఆమె మరణంతో అయినా తేరుకుని ప్రభుత్వం వివిధ కోణాల్లో విచారణ చేయించి వాస్తవాలను గమనించి వాటిని సమూలంగా నిర్మూలించేందుకు కార్యాచరణ అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

అంతకుముందు…?

ఈ నెల 20న తన తల్లితో ప్రీతి మొబైల్ ద్వారా మాట్లాడిన ఆడియో లీక్ అయింది. తనను వేధిస్తున్న సైఫ్ ను, తనను హెచ్ఓడి పిలిపించారని చెప్పుకుంది. తనతో హెచ్ఓడి మాట్లాడాడని తనకు భరోసా ఇచ్చాడని చెప్పుకున్న ప్రీతి సైఫ్ ను కూడా పర్సనల్ గా పిలిచి మాట్లాడడని వివరించింది. అయితే నన్నేం చేస్తారు అన్న ధీమాతో సైఫ్ వ్యవరిస్తున్నాడని, ఆయన పేరిట తాను ఫిర్యాదు చేసినట్టయితే తనను ఒంటరిని చేస్తారని, సెకండీయర్ వాళ్లంత కలిసి ఇలా చేస్తారేమోనన్న భయాన్ని వ్యక్తం చేసింది. సీనియర్లంతా అలా ఆయనలా ఉండరు కానీ సైఫ్ ను మాత్రం నిలదీయరని తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రిన్సిపల్ వద్దకు ఎందుకు వెళ్లావు..? నాకు చెప్తే సరిపోయేది కదా అని తాను బిజీలో ఉన్నాను మళ్లీ మాట్లాడుతానని హెచ్ఓడి చెప్పినట్టుగా కూడా ప్రీతి వివరించింది. అయితే 21వ తేది రాత్రి ఎంజీఎం నైట్ షిఫ్ట్ కు వెల్లిన ప్రీతి 22 తెల్లవారు జామున రెస్ట్ రూంకు వెల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెస్ట్ రూంలోకి వెల్లి చూసే సరికి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని గమనించిన ఆసుపత్రిలో పనిచేస్తున్న వారు పల్స్ రేట్ గమనించి వెంటనే ఉన్నాతాధికారులకు సమాచారం ఇచ్చి చికిత్స అందించారు. అయితే 20వ తేది నుండి 21వ తేది వరకు కెఎంసీలో ఏం జరిగిందన్న విషయం తేలాల్సిన అవసరం ఉంది. వాట్సప్ ఛాటింగ్ ఆధారంగా పోలీసులు సైఫ్ ఆమెను చేసిన కామెంట్స్ గురించి వివరించారు. హెచ్ఓడీ ప్రీతిని, సైఫ్ ను పిలిపించి మందలించిన తరువాత ఏం జరిగింది అన్న విషయాలు బయటకు రావల్సిన అవసరం ఉంది. హెచ్ఓడీ ఏం కాదు నేను చూసుకుంటానని చెప్పిన తరువాత కూడా ప్రీతి ఆత్మహత్యకు పాల్పడే వరకు దారి తీసిన పరిణామాలు ఏంటోనన్నదే చర్చనీయాంశంగా మారింది. హెచ్ఓడీ భరోసా ఇచ్చిన తర్వాత ప్రీతిలో ధీమా వ్యక్తం కావాలి కానీ ఆమె ఆత్మహత్యకు ప్రేరిపించే పరిస్థితులు ఎందుకు చేరాయన్నదే అంతు చిక్కకుండా పోతోంది. తల్లితో మాట్లాడిన తరువాత నుండి ఆమె డ్యూటీకి వెల్లే వరకు జరిగిన పరిస్థితులు ఏంటీ..? డ్యూటీలో చేరిన తరువాత జరిగిన పరిస్థితులు ఏంటీ అన్నదే మిస్టరీగా మారింది. హెచ్ఓడీ పిలిచి మాట్లాడిన తరువాత కూడా ఆమె మానసికంగా అంతలా కుంగిపోవడమేంటన్నది తేలాల్సి ఉంది. అప్పటికే సైఫ్ వ్యవహరించిన తీరుతో మానసికంగా ప్రీతి విసిగిపోయిందా లేక హెచ్ఓడీతో జరిగిన డిస్కషన్ తరువాత మరింత టార్చర్ పెరిగిందా అన్న విషయంపై ఆరా తీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రీతి తల్లి కూడా సైఫ్ ఏమీ చేయలేడని మన వరంగలే కదా మనకేం అవుతుందంటూ ధైర్యం నూరిపోసింది.

టార్చర్ లోనూ…

ప్రీతిలోని ఔదర్యం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సైఫ్ పై ఫిర్యాదు చేసి సస్సెండ్ చేయవచ్చని తల్లి అంటే సస్పెండ్ అవసరం లేదు నా జోలికి రాకుంటే చాలు అన్న రీతిలో ప్రీతి వ్యాఖ్యానించారు. అంటే ఆమె సైఫ్ పెడుతున్న భాదల నుండి విముక్తి చెందితే చాలు తనకు రిలాక్స్ అవుతుందని ఆమె తల్లితో చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. దీనిని బట్టి గమనిస్తే హెచ్ఓడీ పిలిచి మాట్లాడిన తరువాత తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ సైఫ్ మరింత సీరయిస్ గా రెచ్చిపోయాడా లేక మరేదైనా పద్దతిలో ఆమెను ఇబ్బంది పెట్టాడా అన్న విషయాన్ని వెలుగులోకి తీయాల్సి ఉంది. సైఫ్ వల్ల తాను మాత్రమే కాదని జూనియర్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ ఇబ్బందులు పడుతున్నారని వివరించారు ప్రీతి. మిగతా వారు అతని వేధింపులపై ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపో్తున్నారని కూడా వివరించడం ప్రస్తావనార్హం. అసలు సైఫ్ జూనియర్లను వేధించేంత స్వేచ్ఛ ఎలా వచ్చింది..? అతనికి వెన్నుదన్నుగా ఎవరున్నారు..? మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న వారి అండదండలు ఉన్నాయా లేక ఇతర శక్తులు ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రీతి మరణంతో అయినా వీటన్నింటిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆరా తీయించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page