బారత్ మనుగడే లేకుండా పోయేదా..?

బ్రిటీష్ పాలనే భేషా….!

వివాదస్పద వ్యాఖ్యల వెనక…!

బ్రిటీష్ పాలకుల వల్లే భారత్ అభ్యున్నతి సాధించిందని స్టేట్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగూడెంలో ఆయన చేసిన వ్యాఖ్యల వెనక మర్మమేంటన్నదో అందరికీ తెలిసిందే అయినా ఓ ఉన్నాతాధికారి స్థానంలో ఉండి భారత దేశాన్ని తగ్గిస్తూ మాట్లాడడం ఆయనపై విమర్శల దాడిని పెంచింది. ఇటీవల కాలంలో శ్రీనివాస రావు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం పరిపాటిగా మారిందనే చెప్పాలి. తాజాగా ఆయన భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సెమి క్రిస్ మస్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. క్రీస్తును కీర్తించడం వరకు అయితే ఆయన బాగానే ఉండేది కానీ భారత దేశం గురించి ఆయన మాట్లటాడిన మాటలే అందరి దృష్టి పడేలా చేశాయి. ఆధునికత అనేది క్రైస్తవం వల్లేనని, ప్రపంచలో భారత్ మనుగడ సాధించలేకపోయేదని, భారత్ ఇంత అభివృద్ది సాధించలేకపోయేదని డిహెచ్ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆధునిక వైద్యాన్ని, ఆధునిక విద్యను, ఆధునిక సంస్కృతిని ఈ రూపంలో తీసుకరావడం వల్లే మన దేశం అన్ని రంగాల్లో ముందుండే విధంగా చేసిందని కూడా డిహెచ్ అన్నారు. అయితే భారతదేశానికి క్రిస్టియానిటీ వచ్చింది బ్రిటీష్ పాలన సమయంలోనే అన్నది ప్రస్తావనార్హం. డిహెచ్ వ్యాఖ్యలను గమనిస్తే బ్రిటీష్ పాలనను పరోక్షంగా సపోర్ట్ చేసినట్టుగా అర్థం అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అఖండ భారతావని క్రైస్తవులు రాకముందు అన్ని రంగంల్లోనూ వెనకబడి ఉందని చేసిన కామెంట్లపై నెటిజన్లు, జాతీయ వాదులు తప్పు పడుతున్నారు. నిజానికి భారతదేశ చరిత్ర మరీ అంత దయనీయ పరిస్థితుల్లో అయితే లేదన్నది వాస్తవం. దేశంలో ఉన్న శిల్ప కళా సంపద, గురుకుల విద్యా విధానం, వైద్య విధానం లక్షల ఏళ్ల క్రితమే అమలయినట్టుగా చరిత్ర సాక్ష్యాలు చెప్తున్నాయి. ప్రకృతితో్ మమేకమై భారతీయుల జీవనం కొనసాగిందని తేట తెల్లమయిన సందర్భాలు ఎన్నో. అలాంటిది భారత దేశం క్రైస్తవం లేకుంటే మనుగడే సాధించకపోయేదని డిహెచ్ వ్యాఖ్యానించడం మాత్రం అందరినీ ఆశ్యర్య పరుస్తోంది. విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు కూడా డీహెచ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బ్రిటీష్ పాలకుల సమయంలో వారికి అనుకూలంగా రవాణ వ్యవస్థను మెరుగు పర్చుకుని ఇక్కడి ఖనిజ సంపదను తీసుకెళ్లారని, మన కోణార్క్ డైమండ్ కు పట్టుకెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే సమయంలో భారత్ లోకి వచ్చి చేరిన క్రిస్టియనాటిని పొగుడుతూ భారత దేశాన్ని కించపరుస్తూ డీహెచ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

నాడు క్షుద్ర పూజలతో…

గతంలో కొత్తగూడెం జిల్లాలోనే శ్రీనివాస రావు చేసిన తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాశం అయింది. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీపీ దేవుడు పూనాడని చెప్పుకోవడం… ఆ సమయంలో చేసిన క్షుద్ర పూజల్లో ఆయన పాల్గొన్న వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది ఈ విషయం. అప్పుడు కూడా శ్రీనివాసరావుపై విమర్శలు వెల్లువెత్తడం కొంతకాలానికి ఆ విషయం సద్దుమణగింది. అయితే శ్రీనివాసరావు వ్యవహరించిన తీరుపై సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇటీవల మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేయడం కూడా సరికొత్త చర్చకు దారి తీసింది. ఆ తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దుమరాన్ని లేపాయి. కొత్తగూడెం కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన సమ్మేళనం సందర్భంగా సీఎం కేసీఆర్ కాళ్లు వంద సార్లు మొక్కుత తప్పేంటి అని ప్రశ్నించారు. తాను చదువుకున్న రోజుల్లో మెడిసిన్ చేయడానికి అల్లంత దూరం ఉన్న హైదరాబాద్ కు వెల్లాల్సి వచ్చిందని, రాబోచే తరాలకు అందుబాటులోకి వైద్య విద్య తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.

అక్కడే అన్ని…

డిహెచ్ శ్రీనివాసరావు ఎక్కువగా కొత్తగూడెంలో జరుగుతున్న కార్యక్రమాలకు హాజరు అవుతుండడం అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లొ పాల్గొంటుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే అక్కడ జరుగుతున్న సమావేశాల్లో మాత్రమే వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. ఇప్టటికే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగానే శ్రీనివాసరావు ఉపన్యాసాలు ఉంటున్నాయి. ఎక్కువగా కొత్తగూడెం ప్రాంతంలో పర్యటనలు చేస్తున్న ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారని కూడా అంటున్న వారూ లేకపోలేదు. రానున్న కాలంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తరుపున బరిలో నిలవాలన్న లక్ష్యంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.
డీహెచ్ శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు ఈ లింక్ పై క్లిక్ చేసి వినండి…
https://youtu.be/4pAmCXgP3OA

You cannot copy content of this page