వైఎస్ వివేకా మరణం వెనక..?

ఎంపీ అవినాష్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు

దిశ దశ, హైదరాబాద్:

ఇంతకాలం నేను మౌనం గా ఉన్నా… ysrcp క్యాడర్ నన్ను ప్రశ్నిస్తోంది ఇక నుండి నేను మాట్లాడటం మొదలు పెడతానంటూ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. వైఎస్ వివేకానంద హత్య వెనక దాగి ఉన్న నిజాలేంటో వెలుగులోకి తీసుకొస్తానని అవినాష్ కుండబద్దలు కొట్టారు. ఆయన మరణం వెనక పెద్ద వ్యవహారమే నడించిందన్న రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటంటే… ? వైఎస్ వివేకా ది మర్డర్ ఫర్ గైన్ అంటే ఆస్థి కోసం జరిపిన హత్య అని, ఆయన ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడనన్నారు. ఆమె కు పుట్టిన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారని, ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నాడని వివరించారు. ఈ ఆస్థులన్ని వాళ్ళకి వెళ్లిపోతాయని, రాజకీయ వారసులుగా వస్తారని సునితమ్మ భర్త రాజశేఖర్ కుట్ర చేశాడని తనకు అనుమానంగా ఉందని ఆరోపించారు. హత్య జరిగిన ప్రాంతంలో లెటర్ ను మాయం చేశారని, నేను గుండెపోటు అని చెప్పలేదని, ఇదంతా టీడీపీ వాళ్ళు చిత్రీకరించారని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, నా సోదరి సునితమ్మ హై కోర్టులో సుప్రీంకోర్టు లో అనేక ఆరోపణలు చేసినా తాను మాత్రం ఏ ఒక్క రోజూ ఎవరి గురించి మాట్లాడలేదన్నారు. తాను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే సీబీఐ అధికారులు సునితమ్మ కు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేస్తున్నారన్నారు.

You cannot copy content of this page