ఎమ్మెల్యే లాస్య నందిత టిఫిన్ కోసం వెల్లడం వెనక..?

దిశ దశ, హైదరాబాద్:

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం తెల్లవారు జామున పటాన్ చెరూ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఈ కారును ఆమె పీఏ ఆకాష్ డ్రైవ్ చేస్తున్న క్రమంలో యాక్సిడెంట్ కావడంతో లాస్య నందిత ఘటనా స్థలంలోనే మృత్యువాత పడగా పీఏ ఆకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఘటనకు ముందు ఓ దర్గాలో పూజలు చేసిన లాస్య నందిత ఉదయం నుండి ఆహారం తీసుకోకపోవడంతో టిఫిన్ చేసేందుకని బయలుదేరి వెల్లినట్టుగా చెప్తున్నారు. శామీర్ పేట టోల్ ప్లాజా మీదుగా ఔటర్ మీదుగా ప్రయాణం మొదలు పెట్టారని గుర్తించారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కడా కూడా టిఫిన్ సెంటర్లు అయితే ఉండవు. ఎక్కడో ఓ చోట ఔటర్ దిగితే తప్ప ఆమెకు టిఫిన్ సెంటర్ దొరికే అవకాశం లేదు. ఆమె ఔటర్ రింగ్ రోడ్డు పైకి వెళ్లకుండా హైదరాబాద్ వైపు వెల్తే టిఫిన్ దొరికే అవకాశం ఉంటుంది కదా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే శామీర్ పేట నుండి తూంకుట, జూబ్లి బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగంపేట తదితర ప్రాంతాల్లో నిరంతరం జనం రాకపోకలు సాగిస్తుంటారు. జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో హోటల్స్ అందుబాటులో ఉంటాయి కానీ ఔటర్ మీదుగా వెళ్లాలనుకోవడం వెనక ఆంతర్యం ఏంటన్నదే పజిల్ గా మారింది. శామీర్ పేట నుండి సిద్దిపేట రహదారిలోకి వెల్లినా హోటల్స్ అందుబాటులో ఉంటాయి కానీ… వాహనాల రాకపోకలకు మాత్రమే అనువైన ఔటర్ పై హోటల్స్ లేవని తెలిసి ఆ ప్రాంతం మీదుగా ఎందుకు ప్రయాణించారన్నదే మిస్టరీగా మారింది. తెల్లవారు జామున కాబట్టి ఉన్నత శ్రేణి హోటల్స్ అయితే తెరిచే అవకాశం ఉండదు. ఆ సమయంలో హై క్లాస్ హోటల్స్ లో టిఫిన్స్ సిద్దం చేసే పనిలో స్టాఫ్ ఉంటారు కానీ అమ్మకాలు మాత్రం చాలా వరకు మొదలు కావు. వేకువ జాము సమయంలో రోడ్ల పక్కన ఏర్పాటు చేసే టిఫిన్ సెంటర్లు తప్ప మరో చోట అల్పాహారం అమ్మకాలు అయితే మొదలు అవుతాయి కానీ స్టార్ హోటల్స్ లో మాత్రం టిఫిన్స్ సిద్దం అయ్యే అవకాశం అయితే ఉండదు. తెల్లవారు జామున టిఫిన్ కోసమే లాస్య నందిత ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ప్రయాణించడానికి కారణాలు ఏంటన్న విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం అవుతోంది. సదాశివపేట దర్గాలో పూజలు నిర్వహించి వచ్చిన ఆమె పటాన్ చెరు సమీపంలోని ఔటర్ మీదుగానే ఇంటికి చేరి ఉంటుంది. వచ్చేప్పుడే ఆ రోడ్డులో హెటల్స్ ఉన్నట్టయితే టిఫిన్ ప్యాక్ చేయించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆమె ఇంటికి చేరి తిరిగి అదే రహదారి మీదుగా వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ సభ్యులందరిని ఇంటి వద్ద దింపిన తరువాత పీఏ ఆకాష్, లాస్య నందిత మాత్రమే టిఫిన్ కోసం వెల్లాల్సిన అవసరం ఉంటుందా..? అదే పీఏ ఆకాష్ నే టిఫిన్ కోసం పంపించినట్టయితే ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆమెతో ఉన్న సిబ్బందికి అందరికీ సరిపడా టిఫిన్ తీసుకొస్తారు కదా… కుటుంబ సభ్యులంతా కలిసి దర్గాలో పూజలకు హాజరైనప్పుడు కేవలం లాస్య నందితకు మాత్రమే ఆకలి అవుతుందా.? ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆకలితో ఉండే అవకాశం ఉంటుంది కదా..? అలాంటప్పుడు లాస్య నందిత మాత్రమే పీఏ ఆకాష్ ను తీసుకుని టిఫిన్ కోసం వెల్లడం ఏంటన్నదే తేలాల్సి ఉంది. లేనట్టయితే డోర్ డెలివరీ చేసే విధానం కూడా ఉన్నప్పుడు అల్ఫాహారం కోసం వెల్లడం… అందునా ఎమ్మెల్యేనే స్వయంగా వెల్లడానికి గల అసలైన కారణాలు తెలుసుకోవల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఔటర్ మీదుగా వెల్లి టిఫిన్ తీసుకుని రావడానికి కనీసం గంటకు పైగానే సమయం పడుతుంది. అదే సమయంలో ఉప్మా లాంటి టిఫిన్ ఇంటిల్లిపాదికి సరిపడా సిద్దం చేయవచ్చు కదా అని అంటున్నవారూ లేకపోలేదు.

ఆ లైన్ లో ప్రయాణించారా..?

మరో వైపున ఔటర్ రింగ్ రోడ్డుపై లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ముందుగా ఓ లారీని ఢీ కొట్టిన తరువాత డివైడర్ ను ఢికొట్టి ఉంటుందని పోలీసుల ప్రాథమికంగా గుర్తించారు. కారు ఇంజన్ భాగం అంతా కూడా దెబ్బతిన్న తీరు, ఇందుకు తగినట్టుగా కొన్ని క్లూస్ కూడా పోలీసులకు లభ్యం అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రక్కులు, కార్లు ప్రయాణించేందుకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేశారు. సపరేట్ గా ఏర్పాటు చేసిన మార్గాల్లో కాకుండా ఎమ్మెల్యే లాస్య నందిత కారు భారీ వాహనాలు వెల్తున్న మార్గంలో వెల్లిందా..? లేక ఆ భారీ వాహనమే కార్లు ప్రయాణించాల్సిన ‘వే’లో వెల్లిందా అన్నదే అంతు చిక్కకుండా పోయింది. సాధారణంగా ఔటర్ పై వాహనాలు రద్దీగా ఉన్నప్పుడు ఓవర్ టేక్ చేసే క్రమంలో ఇతర మార్గాలను ఎంచుకుంటుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగితే వాహనాలు ఇరువైపుల ఢీ కొట్టుకోవడం సహజం, కానీ లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు మాత్రం ఇంజన్ బాగంలో దెబ్బతిన్నందును ఆమె వాహనం ముందుగా వెల్తున్న భారీ వాహనాన్ని ఢీ కొట్టి ఉంటుందని స్ఫష్టం అవుతోంది. భారీ వాహానాన్ని ఢీ కొట్టినట్టుగా గుర్తించినందున లారీ అయినా కార్లు ప్రయాణించాల్సిన మార్గలో వెల్తుండాలి లేదా ఆమె కారయినా లారీలు వెల్లే మార్గంలో ట్రావెల్ చేసుండాలి. ఏది ఏమైనా యువ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ మరణంపై వెలుగులోకి వస్తున్న ఘటనలు మాత్రం ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే ఔటర్ పైకి వచ్చే వచ్చేందుకు, ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల వద్ద సీసీ ఫుటేజీ ఆధారంగా ఔటర్ పై లభ్యం అయ్యే సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేయడంతో పాటు వివిధ కోణాల్లో కూడా ఆరా తీయాల్సిన అవసరం అయితే ఉంది.

You cannot copy content of this page