ప్రత్యేక విమానం ప్రత్యేకత వెనక…?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం జరగనున్న ఈడీ విచారణకు వెల్తారా లేదా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. 16న జరగాల్సిన విచారణ విషయంలో అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చిన కవిత రేపటి కార్యాచరణ ఎలా రూపొందించుకున్నారన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరడం మరో ట్విస్ట్ చోటు చేసుకుందనే చెప్పాలి.

స్పెషల్ ఫ్లైట్…

ఆదివారం సాయంత్రం అనూహ్యంగా స్పెషల్ ఫ్లైట్ లో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి బయలుదేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈడీ నోటీసులు ఇచ్చిన ప్రతిసారి కూడా కవిత ముందస్తుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కోసం వెళ్లారు. ఈ నెల 9న విచారణకు రావాలని మొదట ఈడీ సమన్లు జారీ చేయగా తాను రాలేనని తన షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయిన నేపథ్యంలో 11న అయితే వస్తానని మెయిల్ చేశారు. ఆమె మెయిల్ కు స్పందించిన ఈడీ అధికారులు ఫిబ్రవరి 11న రావాలని సూచించడంతో 8 సాయంత్రమే ఢిల్లీ వెల్లిన కవిత 10వ తేదిన మహిళా బిల్లుపై భారత్ జాగృతి ఆద్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రామానికి హాజరయ్యారు. అయితే మరునాడు మాత్రం విచారణకు వెల్లిన కవిత 11వ తేది రాత్రి వరకు ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. అదే రోజు రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆమె 12న తండ్రి సీఎం కేసీఆర్ తో పాటు న్యాయ నిపుణుల సమక్షంలో ఈడీ వ్యవహరించిన తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఇదే క్రమంలో కేసీఆర్ కు స్వల్ప అస్వస్థతకు గురి కావడం ఆయన ఏఐజీకి వెల్లడంతో ఈ చర్చలకు తాత్కాలికంగా పుల్ స్టాప్ పడినట్టు సమాచారం. 13న ఆమె జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతోనే గడిపిన కవిత 14వ తేది ఉదయం నుండి మద్యాహ్నం వరకు వివిధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తిరిగి ఢిల్లీ వెల్లిన కవిత 15న మళ్లీ మహిళా బిల్లుపై దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం 16 ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడతానని మీడియాకు చెప్పారు. దీంతో 16వ తేది ఉదయం నుండే తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంటికి మీడియా చేరుకోగా, ఆమె ఈడీ కార్యాలయానికి వెల్తుందన్న కారణంతో ఎస్కార్ట్ వాహనం కూడా చేరుకుంది. అనూహ్యంగా ఈడీకి మెయిల్ చేసి తాను సుప్రీం కోర్టులో వేసిన విచారణ 24 ఉన్నందున కార్యాలయానికి రాలేకపోతున్నాని, ఈడీ అడిగిన వివరాలను సోమా భరత్ ద్వారా పంపిస్తున్నాని చెప్పారు. దీంతో ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చి 20న సోమవారం విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపారు. అయితే గతంలో రెండు సార్లు కామన్ ఫ్లైట్ లోనే వెల్లిన కవిత ఈ సారి మాత్రం స్పెషల్ ఫ్లైట్ లో వెల్లడం ప్రత్యేకతను చాటుకుందనే చెప్పాలి. ఈ సారి మాత్రం కవితతో పాటు అన్న కేటీఆర్, భర్త అనిల్, ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి కూడా ఒకే ఫ్లైట్ లో కలిసి వెల్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

You cannot copy content of this page