కోరలు చాస్తున్న కోవిడ్… అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం

హై అలెర్ట్  ఉండాలన్న కేంద్రం

దిశ దశ, న్యూ ఢిల్లీ:

మళ్లీ కోవిడ్ కోరలు చాస్తున్నట్టుగా కనిపిస్తోంది. భారత్ తో పాటు పలు దేశాలను కలవరపరస్తున్న కొత్త వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ,  కేంద్ర ప్రభుత్వం సూచించాయి.   జెఎన్.1 వేరియంట్ గా గుర్తించిన కొత్త రకం కోవిడ్ ప్రపంచంలోని 38 దేశాలలో కేసులు నమోదు కాగా భారత్ లోనూ దాని ప్రభావం కనిపిస్తోంది. కేరళలో ఒకరు చనిపోగా పలు కేసులు నమోదు అవుతున్నాయి.  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఇప్పటికే ఆయా దేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త కేసులపై నిఘా ఉంచడతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టులు పెద్ద సంఖ్యలో చేయాలని స్పష్టం చేసింది. వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టుల కోసం INSACOG పంపాలని కూడా కోరింది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, వృద్దులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. అయితే దేశంలో నిన్న ఒక్క రోజే కోవిడ్ కొత్త వేరియంట్ తో ఐదుగురు మృత్యువాత పడగా 335 మందికి ఆదివారం ఒక్కరోజే కోవిడ్ సోకినట్టుగా గుర్తించగా దేశ వ్యాప్తంగా మొత్తం 1700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుండి జిల్లాల వారిగా SARI, ILI కేసుల వివరాలను విధిగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో 60 ఏళ్లపై బడిన వారు విధిగా మాస్కులు వినియోగించే విధానం అమలు చేస్తున్నారు.

You cannot copy content of this page