మనలో చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం. ఆదివారం వస్తే చాలు … చికెన్ వండుకుని తినేందుకు ఉత్సాహం చూపుతుంటారు. అంతే కాకుండా చికెన్ డిష్ అనగానే చాలా ఇష్టంగా తినేస్తాం. కొంత మంది అయితే చికెన్ ముక్క లేకుండా ముద్ద కూడా దిగదు అని అంటుంటారు. డాక్టర్స్ దీన్ని ఎక్కువగా తినమని చెబుతుంటారు..ఎందుకంటే దీనిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. అయితే అతి అన్నివేళల్లోనూ మంచిది కాదని మన పూర్వీకులు చెప్పినట్టుగానే చికెన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. ఎక్కువగా చికెన్ వంటకాలను ఆహారంగా తీసుకుంటే ఈ ఆరోగ్య బాధలు తప్పవని తేల్చి చెప్తున్నారు.. అవేంటో మీరూ తెలుసుకోండి…
- చికెన్ పై సాల్మొనెల్లా, క్యాంపీలోబాక్టెర్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అందుకే చికెన్ తీసుకువచ్చిన రెండు మూడు గంటల్లో కర్రీ చేసుకొని తినాలి. కొంత మంది ఫ్రిజ్‌లో పెట్టి కొంచెం కొంచెం వండుకుంటారు. అలా చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి కొత్త ఆరోగ్య సమస్యలకు హాయ్ చెప్పాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల నిమోనియా వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- రోజూ చికెన్ తింటే.. బరువు తొందరగా పెరుగుతారని నిపుణులు వెల్లడించారు. చికెన్‌లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అది శరీరం బర్న్ చేయలేని విధంగా ప్రోటీన్స్ తయారవుతుంటాయి . అది కొవ్వు రూపంలో పెరుగుతుంది. దీనివల్ల చికెన్ అతి ప్రియులు బరువు కూడా ఈజీగా పెరిగిపోతారట. నిపుణలు పరిశోధనలు చేసి కొన్ని విషయాలు వెల్లడించారు. మనం తీసుకునే ఫుడ్ కు , పెరిగే బరువుకు సంబంధం ఉంటుందట.
- చికెన్ ఉడకబెట్టి తింటే ఆరోగ్య సమస్యలు దరి చేరవట. లేదంటే క్యాన్సర్ వస్తుందట. ఎక్కువగా చికెన్ ఫ్రై తినవద్దని డాక్టర్స్ సూచిస్తున్నారు.
నిపుణులు ఇస్తున్న ఈ సలహాలను గమనించి చికెన్ ప్రియులు తమ అలవాట్లను మార్చుకోవడం బెటరని స్పష్టం అవుతోంది. కాబట్టి తరుచూ చికెన్ వంటకాలను తినే పద్దతికి స్వస్థి పలకడం మంచింది.