బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యకు బిగ్ షాక్

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఊహించని షాక్ తగలింది. రాజయ్యపై మహిళా కమిషన్‌ యాక్షన్‌కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం మహిళ సర్పంచ్‌ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్ట​ర్‌ వేదికగా కమిషన్‌ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని జానకీపురం సర్పంచ్‌ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఎమ్మెల్యే ఫోన్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్‌ రికార్డ్స్‌ ఉన్నాయని తెలిపారు. సమయం చూసి అవన్నీ బయటపెడతానని నవ్య చెప్పారు.

తన వెనక ఎవరూ లేరని సర్పంచ్ నవ్య స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తనపై మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చారని రాజయ్య తెలిపారని నవ్య చెప్పారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారని ఆరోపించారు. హగ్‌ చేసుకోవడానికి వస్తారని.. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా అని నిలదీశారు. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా అని అడిగారు. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి.. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. ఇప్పటికైనా రాజయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజయ్య డిమాండ్ చేశారు.

You cannot copy content of this page