వలకు చిక్కిన చేప…ఆశ్చర్యంలో మత్స్యకారులు
తెలంగాణ, మహారాష్ట్ర సరిహధ్దుల్లో మత్సకారుల వలలో భారీ సైజు చేప చిక్కింది. వల వేసి పడుతున్న క్రమంలో బరువుగా ఉండడంతో ఏమై ఉంటుందాని ఆశ్చర్యపడ్డ మత్స్యకారులు వలను బయటకు తీసిన తరువాత అందులో చిక్కిన చేపను చూసి ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా కేంద్రానికి చెందిన మత్స్య కారులు సమీపంలోని ప్రాణహిత నదిలో చేపలు పట్టేందుకు వెల్లారు. వీరి వలలకు భారీ సైజు చేప పడడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నీటి నుండి బయటకు తీసిన తరువాత తూకం వేస్తే 38 కిలోల బరువు ఉందని మత్స్యకారులు తెలిపారు. నిత్యం తక్కువ బరువు ఉండే ఫిష్ హంటింగ్ చేసే మత్సకారులు ఒకే సారి భారీ సైజు చేప తమ వలలో పడడంతో ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద చేప తమ వలలకు చిక్కలేదని వారు తెలిపారు. ప్రాణహిత నదిలో భారీ సైజ్ చేప వలలకు చిక్కిందన్న సమాచారం అందుకున్న స్థానికులు ప్రత్యేకంగా వెల్లి చూసి అబ్బురపడిపోయారు.