ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు కేసీఆర్ సర్కార్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మలుపులు మీద మలుపులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో సంచలనం రేపిన ఈ కేసు తెలంగాణ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణ జరగ్గా.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టును ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ ను వెంటనే విచారించాలని సీజేఐని ప్రభుత్వం కోరింది. ఈ కేసును సీబీఐ విచారిస్తే సాక్ష్యాలన్ని ధ్వంసం అవుతాయని ప్రభుత్వ తరపు న్యాయవాది, సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే తెలిపారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. రేపు ధర్మాసనం దష్టికి ఈ వియాన్ని తీసుకురావాలని దుష్యంత్ దవేకు సూచించారు. రేపు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్తే వచ్చేవారం విచారణకు అనుమతిస్తామని చెప్పారు.

ఈ కేసులో సిట్ విచారణను రద్దు చేసి హైకోర్టు సింగిల్ బెంచ్.. సీబీఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం సవాల్ చేసింది. దీంతో డివిజన్ బెంచ్ కూడా సీబీఐ విచారణకు ఆదేశాలు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో. .సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, అప్పటివరకు ఆర్డర్ ను నిలుపుదల చేయాలని కోరింది. అయితే దీని కోసం ప్రధాన న్యాయమూర్తి దగ్గర అనుమతి తీసుకోవాలని కోరింది.

రేపు ప్రధాన న్యాయమూర్తి దగ్గర అనుమతి తీసుకుంటామని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి తెలిపారు. అనంతరం రేపటికి విచారణను విచారణను హైకోర్టు వాయిదా వేసింది.దీనిపై సీబీఐ కేసు నమోదు చేసిందా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే కేసు వివరాలు ఇవ్వాలని చాలాసార్లు సీబీఐ ఒత్తిడి తెచ్చిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అయితే తాము నాలుగుసార్లు కోరినా కేసు వివరాలు ఇవ్వలేదని, సిట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు.

You cannot copy content of this page