సీసీ కెమెరాలతో లైవ్
దిశ దశ, హైదరాబాద్:
పటాయా హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో జూదగాళ్లను పట్టుకున్న వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ద్వారా లైవ్ రిలే కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా థాయ్ పోలీసులు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు క్యాసినో గ్యాంబ్లింగ్ గేమ్ నిర్వహాకులు ఏ స్థాయిలో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారో స్పష్టమవుతోంది. థాయిలాండ్ పోలీస్ చీఫ్ కంపోల్ చోన్ బురి మీడియాకు పటాయా హోటల్ కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. థాయిలాండ్ కు సంబంధించిన మహిళలు, పురుషులతో కలిసి టూరిస్టులు హోటల్ కు చేరుకున్నారని తెలిపారు. అందులోని కాన్ఫరెన్స్ హాల్ లో క్యాసినో జూదం ఆడించారని, ఇందుకు సంబందించిన గేమ్ ను సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్ కు లైవ్ లో రిలే చేస్తున్నారని వివరించారు. ఈ దాడుల్లో కార్డ్ డీలర్లు, జూదం ఆడేందుకు వినియోగించే పరికరాలు అన్ని కూడా భారత్ నుండే భారత్ నుండే రవాణా చేసుకున్నారని తెలిపారు. తాము దాడి చేసినప్పుడు టూరిస్టులు క్యాసినో ఆడుతున్నారని, Baccarat, BLACKJACK 25 సెట్ల కార్డ్స్, రూ. 1.6 లక్షల నగదు, జూదగాళ్ల కదలికలపై నిఘా వేసేందుకు ఉప యోగించిన సీసీ కెమెరాలు, 92 మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, మూడు నోట్ బుక్ కంప్యూటర్లు, కార్డ్స్ డిస్పెన్సర్లు, నగదు లావాదేవీలకు ప్రత్యామ్యాయంగా ఉపయోగించిన చిప్స్ స్వాధీనం చేసుకున్నామని థాయి పోలీసు అధికారి చోన్ బురి తెలిపారు. ఈ గేమింగ్ వ్యవహారంలో థాయిలాండ్ కు చెందిన మరో మహిళ కూడా కీలక పాత్ర వహించినట్టుగా అక్కడి పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం.
సెంటర్ హైదరాబాదా..?
థాయిలాండ్ పటాయాలో రెండు రోజుల క్రితం దొరికిన క్యాసినో జూదగాళ్ల వ్యవహారం వెనక అక్కడి పోలీసులు వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. క్యాసినో గేమింగ్ మూలాలు హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. పటాయా హోటల్ కాన్ఫరెన్స్ నుండి నేరుగా హైదరాబాద్ కు క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ద్వారా లైవ్ రిలే చేశారంటే ఈ మాఫియాతో హైదరాబాదీల పాత్ర కీలకంగా ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో లైవ్ రిలే చూస్తూ ఎవరు మానిటరింగ్ చేశారు..? పటాయా గేమింగ్ లైవ్ రిలే చేయడానికి కారణాలు ఏంటీ..? ఈ వ్యవహారం వెనక ఎవరెవరు ఉన్నారు తదితర అంశాల గురించి స్థానికంగా చర్చ సాగుతోంది. గతంలో ఈడీ విచారణ ఎదుర్కొన్న చీకోటి ప్రవీణ్ తో పాటు, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, పలువురు వ్యాపారులను థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పటాయాలో థాయ్ పోలీసుల దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఇక్కడి వారు ఎవరెవరు ఇందులో ఉన్నారు అన్న విషయాలపై చర్చలు సాగుతున్నాయి. కేవలం ఇది లైవ్ రిలే కోసమే ఉపయోగించారా లేక ఆన్ లైన్ బెట్టింగ్ లో హైదరాబాద్ వాసులు పాల్గొన్నారా అన్న చర్చ సాగుతోంది. నిర్వహకులు ఇక్కడి వారే కావడం పటాయాకు పెద్ద ఎత్తున టూరిస్టుల పేరిట తీసుకెళ్లడం లైవ్ లో గేమ్ కొనసాగించడం వెనక ఎన్ని కోట్లు చేతులు మారి ఉంటాయోనన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
రూ. 4 లక్షల చొప్పున…
అక్కడ ప్రాస్టిట్యూట్ విధానం లీగల్ కావడంతో చాలా మంది పర్యాటకులు ధాయ్ లాండ్ వెల్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. కొన్ని ప్రావిన్స్ ఏరియాల్లో క్యాసినో వంటి జూదం ఆడడం నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. దీంతో గేమింగ్ యాక్టు విషయంలో అక్కడి చట్టాలు అత్యంత తీవ్రంగా పరిగణిస్తుంటాయి. తాజాగా పటాయా కాన్ఫరెన్స్ హాల్లో పట్టుబడ్డ భారతీయుల విషయంలో కూడా అక్కడి పోలీసులు కఠిన చట్టాలను ఉపయోగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గేమింగ్ యాక్టులో పాల్గొనేందుకు వెల్లే వారు ఒక్కొక్కరు రూ. 4 లక్షల చొప్పున నిర్వాహకులకు చెల్లించాల్సి ఉంటుందని, ఆ తరువాత ప్యాకేజీ టూర్ తీసుకెల్తారని తెలుస్తోంది.