ఆ సమాచారం అటు… ఈ సమాచారం ఇటా..? షికార్లు చేస్తున్న పుకార్లు దేనికి సంకేతం..?

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతున్న ప్రచారం వెనక అసలేం జరిగింది..? ఓ వైపున సర్కారు అవసరాలు తీర్చే పని చక్కబెడుతూనే… మరో వైపున తమ సొంత పనులను చక్కబెట్టుకున్నారా..? లీకులను బట్టి గమనిస్తే చాటుమాటు వ్యవహారం వెనక మరో దందా కొనసాగిందన్న అనుమానలు అయితే రేకెత్తుతున్నాయి.

పాలిటిక్స్…

రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించే దిశగా పావులు కదిపిన బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన సమాచారం చేరవేసే పనిలో నిమగ్నం అయిన స్పెషల్ టీమ్ మెంబర్స్ అదే పనిలో ఉంటున్నామన్న భ్రమలు కల్పించి తప్పుడు మార్గాలను ఎంచుకున్నట్టుగా ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలను బట్టి స్ఫష్టం అవుతోంది. ఇందు కోసం భారీగా ఏర్పాటు చేసుకున్న నెట్ వర్క్ వల్ల ఎవరేం చేస్తున్నారోనన్న అజమాయిషీ కూడా లేకపోవడంతోనే సరికొత్త రీతిలో దందాలకు తెరలేపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఎన్నెన్నో మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రైవేటు వ్యస్థను కూడా టార్గెట్ చేయడం విస్మయం కల్గిస్తోంది. మార్చి 10న కేసు నమోదయినప్పటి నుండి దర్యాప్తు అధికారులు చేపట్టిన విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలు మాత్రం చట్టం ముసుగేసుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టుగా తేలుతోంది. ఇప్పటికే సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పోలీసు అధికారులు తన ఫోన్ ట్యాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారని కూడా ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇటీవల సంధ్య కన్వెన్షన్ ఎండీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెల్లి అందించారు కూడా. అయితే ఎస్ఐబీ కార్యాలయంలోని లాగర్ రూమ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్, సాక్ష్యాధారాల తారుమారు వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులకు చేరిన ఫిర్యాదుపై దర్యాప్తు సాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్న క్రమంలో బయటకు వస్తున్న విషయాలు మాత్రం అందరిని ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి.

మరో ఛానెల్…

అయితే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన విషయాలను బట్టి అయితే మాత్రం కేవలం పొలిటికల్ వింగ్ తో మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయంగా మరో ఛానెల్ కూడా ఏర్పాటు చేసుకుని వసూళ్లకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ నయా నెట్ వర్క్ తో కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. మహిళలను కూడా టార్గెట్ చేసుకుని ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న విషయమే అందరిని కలిచివేస్తోంది. రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్న పర్సనల్ లైఫ్ విషయంలో కూడా తలదూర్చి కొంతమంది పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమించిన తీరే సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రభుత్వానికి కావల్సిన సమాచారంతో పాటు తమ స్వార్థం కోసం కూడా కొంతమంది పోలీసు అధికారులు బడా వ్యాపారులను, రియాట్లర్లను టార్గెట్ చేసుకుని ట్యాప్ చేసిన తీరే అందరిని విస్మయ పరుస్తోంది.

You cannot copy content of this page