EPFO నుంచి బిగ్ అప్డేట్.. ఇక ఇంటి నుంచే సేవలు

ప్రభుత్వ, కార్పొరేట్ సంస్ధల్లో పనిచేసే ప్రతిఒక్కరికీ పీఎఫ్ సౌకర్యం ఉంటుంది. అయితే ఈపీఎఫ్ఓ సేవలను మరింత సులువుగా ఉద్యోగులకు అందించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కొత్త కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తెస్తుంది. పనులు సులువుగా అయ్యేలా అనేక వెసులుబాట్లు కనిపిస్తోంది. తాజాగా ఈపీఎఫ్ఓ మరో బిగ్ అప్డేట్ తీసుకొచ్చింది.

పెన్షనర్లకు ఇబ్బందులు లేకుండా కొన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. వీటి వల్ల ఈపీఎఫ్ఓ ఆఫీసులకు వెళ్లకుండా పెన్షన్‌దారులు ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా సేవలు పొందవచ్చు. దాదాపు నాలుగు రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెన్షన్ క్లెయిమ్ ఆన్ లైన్ ద్వారానే అప్లై చేసుకునే అవకాశాన్ని కొత్తగా అందుబాటులోకి తెచ్చినట్లు ఈపీఎఫ్ఓ తాజాగా ప్రకటించింది. ఈపీఎఫ్ఓ మెంబల్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో క్లెయిమ్ కోసం పెన్షనర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పెన్షన్ పాస్ బుక్‌ను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు చూసుకునేలా కొత్త సౌకర్యం తెచ్చింది. దీని కోసం మొబైల్ లేదా డెస్క్ టాప్ లో ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి పెన్షన్ సొమ్మును చెక్ చేసుకోవచ్చు.

అలాగే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం కొత్తగా ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తెచ్చింది. డిజీ లాకర్ ద్వారా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ను పెన్షనర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించే సౌకర్యాన్ని కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆధార్ ఫేష్ఆర్ డీ యాప్ ద్వారా ఈ సేవలు పొందవచ్చని తెలిపింది.ఈ సేవల ద్వారా పెన్షన్ దారులకు పనులు సులువు అవుతాయి.అలాేగే యాప్ ద్వారా లైఫ్ డిజిటల్ సర్టిఫికేట్‌ను కూడా పెన్షనర్లు పొందవచ్చు.

You cannot copy content of this page