మునుగోడు బీజేపీ ఫెయిల్యూర్స్… ఇవే

మూడో విడుత పాదయాత్ర సమయంలో బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడం.. ఉప ఎన్నికల వస్తున్న నేపథ్యంలో మునుగోడును పాదయాత్రలో కవర్ చేసినా అక్కడి ఓటర్లను అనుకూలంగా మల్చుకోలేకపోయిందా అన్నదే ఇఫ్పుడు అసలు ప్రశ్న. ముఖ్యమంత్రి కేసీఆర్ పై దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మల్చుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. బలమైన నేతలు ఉన్న చోట పార్టీ గెలుపు కోసం కృషి చేసి సఫలం కావాలని భావించినప్పటికీ మునుగోడులో పాత్రం సఫలం కాలేకపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తెరపైకి రావడంతో రూట్ మ్యాప్ మార్చి మరి మునుగోడును కవర్ చేసేసింది ఆ పార్టీ. కమలనాథుల్లో నెలకొన్న జోష్.. రాజగోపాల్ రెడ్డికి ఉన్న హోష్ రెండూ కలిస్తే అసెంబ్లీలో మరో తమ పార్టీ బలం పెరుగుతుందని వేసిన అంచనాలు అన్నీ విఫలం అయ్యాయి. సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో మునుగోడు నియోజకర్గంలో తిరగడంతో పాటు అక్కడి క్యాడర్ తో కలిసి పనిచేసే విధంగా వ్యూహ రచన చేశారు. అయితే నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత అవన్ని హుష్ కాకీ అయిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బీజేపీ ముఖ్య నాయకత్వం వ్యవహరించింది. సీట్ పక్కా అనుకున్నప్పటికీ మునుగోడు ఫలితాలతో చతలకిలపడిపోయినట్టుగా మారిపోయింది కమలం పరిస్థితి.

నిశ్శబ్ద ప్రచారానికి తెర..

అయితే బీజేపీకి అత్యంత ఎక్కువగా కలిసి వచ్చే అంశం ఫుల్ టైమర్స్ చేసే వ్యక్తిగత ప్రచారం. ఈ ప్రచారం విషయంలో సంఘ్ పరివార్ వ్యూహాత్మకంగా వ్యవహరించనట్టుగా స్పష్టం అవుతోంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయబోయే ఉప ఎన్నికలన్న సంకేతాలు ఇచ్చకున్న బీజేపీ మెయిన్ లీడర్స్ గ్రౌండ్ లెవల్ క్యాంపెయిన్ విషయంలో అట్టర్ ప్లాప్ అయినట్టుగా స్పష్టం అవుతోంది. అక్కడి ప్రజల నాడిని అంచనా వేసి అందుకు తగిన విధంగా ప్రచారం చేసేందుకు పార్టీ దాని అనుభంధ విభాగాలు, సంఘ్ పరివార్ సక్సెస్ కాలేకపోయిందన్నది నిజం. ఆరెస్సెస్, బీజేవైఎం, ఏబీవీపిలకు చెందిన ఫుల్ టైమర్స్ సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోనట్టు స్పష్టం అవుతోంది.

కొంప ముంచిన ఫాంహౌజ్ వ్యూహం

ప్రదానంగా మొయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారం ఉచ్చులో బీజేపీ చిక్కుకుందనే చెప్పక తప్పదు. ఫాంహౌజ్ లో టీఆరెఎస్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ వెలుగులోకి రాగానే ఆ విషయం తమ పార్టీకి అంటుకోకుండా ఉండాలన్న ప్రయత్నంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం మునిగిపోయి అసలు విషయాన్ని విస్మరించిందనే చెప్పాలి. బీజేపీ నాయకత్వం దృష్టిని మరల్చడంతో చివరి వారం రోజుల్లో బీజేపీ చేయాల్సినంత స్థాయిలో ప్రచారం చేయలేకపోయింది. ఫాంహౌజ్ వ్యవహారం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన బిగ్ స్కెచ్ అంటూ కౌంటర్ ఇచ్చే పనిలో నిమగ్నం అయిన బీజేపీ కీలకమైన సమయంలో మెయిన్ క్యాంపెయిన్ ను పక్కనపెట్టేసిందనే చెప్పాలి. సాధారణంగా పోలింగ్ కు వారం రోజుల ముందు నుండి బీజేపీ ప్రత్యర్థి పార్టీకి మింగుడుపడకుండా చేస్తోంది. ప్రచారం చేసుకునేసమయం ముగిసే వరకూ చేపట్టే ప్రచారం అంతా ఇంతాకాదు. స్టార్ క్యాంపెనర్లు, పార్టీ మెయిన్ లీడర్లు ఏక కాలంలో ప్రచారం చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. చివరి వారం రోజుల్లో చేపట్టే ఈ ప్రచారం వల్ల ప్రత్యర్థి పార్టీలు కూడా డైలమాలో పడిపోతుంటాయి. కానీ మునుగోడు విషయంలో మాత్రం బీజేపీ ఆ స్థాయి ప్రచారం చేయలేకపోయింది. ముఖ్య నాయకులంతా కూడా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం లక్ష్యంగా ముందుకు సాగారు. అంతేకాకుండా కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేలను పరిచయం చేశారు. అయితే ఈ తంతు వల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లుంతుందా అన్న డిపెన్స్ లో పడిపోయింది తప్ప అఫెన్స్ చేసే ప్రయత్నంలో మునగకపోవడం విడ్డూరమనే చెప్పాలి. ఓరకంగా చెప్పాలంటే మునుగోడు విషయంలో బీజేపీ భారీ స్థాయి సినిమా తీస్తోందన్న ప్రచారం జరిగినా బాక్సాఫీసు వద్ద బోల్తాపడిపోయిందన్నది నిజం.

You cannot copy content of this page