సముద్రంలో పడవ బోల్తా.. 30 మంది మృతి

ఇటలీలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలోని అయోనియన్ సముద్రంలో పడవ మునిగి 30 మంది మరణించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 40మంది ప్రయాణికులు బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో 100 మంది వలసదారులు ఉన్నారు. కోస్టు ​గార్డు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

బోటు ప్రమాద ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మృతుల్లో నెలల చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే పడవపై వలస వచ్చిన వారు ఏ దేశస్థులో ఇంకా తెలియలేదని చెప్పారు. పడవ ఎక్కడ నుంచి వచ్చిందో కూడా తెలియరాలేదని స్పష్టం చేశారు.

కాగా, గతేడాది అక్టోబరులో నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. 85 మందితో వెళ్తున్న పడవ ఒగ్​బారూ ప్రాంతంలో వరదల కారణంగా ఒక్కసారిగా మునిగిపోయింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇతర విభాగాల సిబ్బందిని రంగంలోకి దింపారు. గల్లంతైన వారి కోసం గాలించి 76 మృతదేహాలను వెలికితీశారు. ఈ బోటు ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భవిష్యత్​లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Boat capsize in the sea.. 30 people died

You cannot copy content of this page