బొమ్మకల్ శ్రీనివాస్ రాజీనామా

జీవీఆర్ కు లేఖ ఇచ్చిన పురుమళ్ల

దిశ దశ, కరీంనగర్:

బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడడంతో అంటీముట్టనట్టుగా ఉంటున్న శ్రీనివాస్ తన రాజీనామా లేఖను ఆదివారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జివి రామకృష్ణారావుకు ఇచ్చారు. తనకు పార్టీ నాయకులు అండగా నిలవలేదని తనను ఇబ్బందులకు గురి చేసినందువల్లే బీఆర్ఎస్ కు రాజీనామా చేయాల్సి వస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న పురుమళ్ల శ్రీనివాస్ రెండు రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేస్తారన్న ప్రచారం ఊపందుకున్నప్పటికీ ఆయన మాత్రం ఆదివారం రాజీనామా చేశారు. అయితే ఆయన భార్య కూడా జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతు ఆమె బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా లేక భర్త వెంటే నడుస్తారా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.

You cannot copy content of this page