సాంప్రాదాయ కళలకు వేదిగా మారిన స్కూల్స్
దిశ దశ, కరీంనగర్:
ఆషాడ మాసం రాగానే తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనమొత్తుకునే సంప్రాదాయం తరతరాలుగా సాగుతోంది. తమ ఆరాధ్య దేవళ్లుకు బోనాలు సమర్పించడం, అమ్మవార్లను ప్రత్యేకంగా పూజించే ఆనవాయితీ కుటుంబాలకే పరిమితమయ్యేది. కానీ నేటి తరానికి పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న ఆచారా వ్యవహారాలపై అవగాహన కల్పించేందుకు ప్రేవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా చొరవ తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించడం, పొతరాజుల వేష ధారణలతో విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కరీంనగర్ నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో బోనాల సంస్కృతిని నిర్వహిస్తుండడంతో విద్యా సంస్థలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
రావుస్ మైటెక్నో స్కూల్
జిల్లా కేంద్రంలోని రావుస్ మైటెక్నో పాఠశాలలో బోనాల సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో బో్నాల సమర్పించే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావుస్ మై టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ రెహమాన్ మాట్లాడుతూ…తెలంగాణాలో సాంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేయడం ఆనవాయితీగా వస్తుందని, కుటుంబలతో పాటు మానవ సంబంధాలు మెరుగు పర్చుకునేందుకు ఇలాంటి సామూహిక కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయన్నారు. హ్యూమన్ రిలేషన్ విషయంలో పూర్వీకులు ప్రత్యేక శ్రద్ద కనబర్చేవారని అందుకే బోనాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించే వారన్నారు. అయితే కాలక్రమేణా మారిన పరిస్థితుల వల్ల నేటి తరానికి శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలపై అవగాహన లేకుండా పోతోందన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో తమ పాఠశాలలో చదువకుంటున్న విద్యార్థులను కూడా అందుకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విద్యార్థి దశలోనే పండుగలు వాటి ప్రత్యేకతల గురించి అవగాహనా కల్పించడం వల్ల భావి తరాలకు వాటియోక్క ప్రాధాన్యతను తెలియిజేసినట్టు అవుతుందని రెహమాన్ అభిప్రాయపడ్డారు. బోనాల వేడకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించి నృత్యాలు, పోతరాజు వేషధారణలో చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ఐవీ ప్రీ ప్రైమరీ పాఠశా…
సీతారాంపూర్ లోని ఐవి ప్రీ ప్రైమరీ పాఠశాలలో బోనాల వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ వి హై పాఠశాల చైర్మన్ పసుల మహేష్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారన్నారు. బోనం అంటే భోజనం లేదా నైవేద్యమని ఈ బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగని ఈ వేడుకలు ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారన్నారు. ప్రతి ఆషాడ మాసంలో ఈ ఉత్సవాలను జరుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పసుల జయశ్రీ, ఈ కార్యక్రమంలో చిన్నారులు అమ్మవారి వేషధారణలతో మరియు పోతరాజు వేషధారణలతో పాటు బోనాలు తీసుకురావడం పలువురిని ఆకట్టుకుంది.