నాడు ట్రంప్- నేడు బైడెన్- సేమ్ టు సేమ్

దిశ దశ, అంతర్జాతీయం:

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా పాజిటివ్. అమెరికాలో కలకలం రేపిన వార్త ఇది. ముఖ్యంగా బైడెన్ పార్టీ వాళ్లకు టెన్షన్ కలిగించిన సంచలన వార్త. ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే తడబడుతూ ట్రంప్ ఇమేజ్ పెంచుతున్నారు బైడెన్. ఆయన గెలవడం కష్టమనఏ అంచనాలు వెలువడుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోవాల్సిన సమయంలో ఆయన కరోనా బారిన పడటంతో ఇక గెలిచినట్టే అని పెదవి విరుస్తున్నారు కొందరు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2020లో ఇలాగే అధ్యక్ష పదవికి ఎన్నికల సందర్భంగా ఇదే సీన్ కనిపించింది. అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన భార్య కరోన బారిన పడ్డారు. సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు. అప్పట్లో ట్రంప్ ఒక విడత పదవిలో ఉన్న తర్వాత రెండో సారి ఎన్నిక కావడానికి పోటీ చేసి బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు బైడెన్ కూడా ఒక విడత పదవిలో ఉండి రెండో సారి గెలవడానికి పోటి పడుతున్నారు. అప్పుడూ ఇప్పుడూ వీళ్లిద్దరే ప్రత్యర్థులు. అప్పుడు కరోనా బరిన పడిన ట్రంప్ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎన్నికల ఫలితం అప్పటి లాగే రిపీట్ అవుతుందా? సిట్టింగ్ పెసిడెంట్ బైడెన్ ఓడిఒపోక తప్పదా అనే చర్చ అమెరికాలోనే కాదు, ప్రపంచం అంతటా జరుగుతున్నది. నవంబర్ 5న పోలింగ్ నాడు అమెరికా ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూద్దాం.

You cannot copy content of this page