కొత్త కూటమితో విపక్షాలు…

పాత కూటమితో అధికార పక్షం

గురువారం నుండి పార్లమెంట్

దిశ దశ, న్యూ ఢిల్లీ:

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో 21 కొత్త బిల్లులు, 7 పాత బిల్లులను.ఏన్డీఏ స
ప్రభుత్వం తెరపైకి తీసుకరానుంది. అయితే ఈ సమావేశాల్లోనే యునిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టనుందా లేదా అన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయితే ఇదే అంశంపై అధికార పార్టీని ఇరుకున పెట్టాలని విపక్ష కూటమి యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏన్డీఏ సర్కారు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగనుందోనన్న చర్చ సాగుతోంది.

కొత్త కూటమితో తొలిసారి

ప్రధానంగా ఈ సారి పార్లమెంటులో విపక్షాలు INDIA కూటమిగా ఏర్పడిన రెండు రోజుల్లోనే పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మంగళవారం యూపీఏ మిత్రపక్షాలు సమావేశం అయి యూపీఏకి బదులుగా ఇండియా అని పేరు మార్చారు. కొత్త పేరు మార్చుకున్న తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్ష మిత్రపక్షాలన్ని కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా ఇండియా మిత్ర పక్షాలు ప్రభుత్వాన్ని ఎలాంటి ఎత్తులతో ఎండగట్టనుంది, వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ప్రదర్శించే వ్యూహాలేమిటోనన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే విపక్ష కూటమి ఎత్తులపై నిఘా వర్గాల నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం కౌంటర్ అటాక్ కు కూడా సిద్దమైన నేపథ్యంలో సభ రసవత్తరంగా సాగనుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page