తనయుడి ఇలాకాలో ప్రసంగం ఎఫెక్ట్… తండ్రి ప్రచారానికి బ్రేక్…

దిశ దశ, హైదరాబాద్: 

తనయుడు ఇలాకాలో పర్యటించినప్పుడు తండ్రి నోట వచ్చిన మాటల ఫలితం 48 గంటల పాటు ప్రచారానికి దూరం కావల్సి వచ్చింది ఆ ముఖ్య నేత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంలో మాట తూలారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదుపై విచారించిన ఈసీఐ విచారించింది. ఈ మేరకు 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. బుధవారం రాత్రి నుండి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో రెండు రోజుల పాటు బీఆర్ఎస్ చీఫ్ ప్రజల మధ్య కనిపించే అవకాశం లేకుండా పోయింది.

కీలకమైన ప్రాంతాలు… 

లోకసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతున్న బీఆర్ఎస్ చీఫ్ క్యాంపెయిన్ కు తాత్కాలికంగా బ్రేేక్ పడడం ఆ పార్టీ వర్గాలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన కేసీఆర్ కు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన కొత్త జోష్ నింపినట్టయింది. ఈ ఆనందంతో అభ్యర్థులు కూడా బరిగీసి కొట్లాడేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం  రాత్రి మహబూబాబాద్ రోడ్ షో ముగించుకున్న తరువాత వరంగల్ లో నైట్ హాల్ట్ చేయాల్సి ఉంది. గురువారం ఉదయం జమ్మికుంట, శంకరపట్నంలలో రోడ్ షో నిర్వహించాల్సి ఉండగా, శుక్రవారం రామగుండం రోడ్ షో కోసం ప్రణాళికాలు రూపొందించారు. కేసీఆర్ కు అతి సన్నిహితంగా ఉండే వినోద్ కుమార్ పోటీ చేస్తున్న జమ్మికుంట కరీంనగర్ నియోజకవర్గంలో వస్తుండగా, ఆయనకు వీర భక్తుడిగా ఉండే కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తున్న పెద్దపల్లిలోని రామగుండంలో రోడ్ షోలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే పార్టీ ఊపు కనిపిస్తున్న క్రమంలో అధినేత కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించినట్టయితే తమ బలం మరింత పెరుగుతుందని ఆశించారు. అనూహ్యంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ చీఫ్ ఫస్ట్ ఫేజ్ ప్రచారానికి బ్రేకుపడినట్టయిది. దీంతో 3వ తేది నుండి కేసీఆర్ టూర్ షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేయాల్సి ఉంది.

You cannot copy content of this page