మానకొండూరులో ఇసుక లారీలకు బ్రేక్

అడ్డుకున్న స్థానికులు

దిశ దశ, మానకొండూరు:

కరీంనగర్ జిల్లా మానకొండూరు శివర్లలో భారీగా ఇసుక లారీలను స్థానికులు అడ్డుకున్నారు. నిరాంటకంగా వెల్తున్న లారీలతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దుమ్ము ధూళితో తాము అనారోగ్యాలకు గురవుతున్నామంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్థానికులు నిలువరించడంతో కిలోమీటర్ల మేర లారీలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. మానకొండూరు, అన్నారం రహదారి మీదుగా వస్తున్న ఈ లారీలను నిలిపివేయడం పాటు స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


స్థానికులు అడ్డుకోవడంతో మానకొండూరులో నిలిచిపోయిన లారీలు


ఎక్కడివో..?

అయితే లారీ డ్రైవర్లు చెప్తున్న కథనం ప్రకారం అయితే తాము జమ్మికుంట ప్రాంతం నుండి ఇసుక తరలిస్తున్నామని చెప్తున్నారు. కానీ జమ్మికుంట నుండి అయితే హుజురాబాద్ లేదా కమలాపూర్ ప్రాంతాల మీదుగా ఉన్న హైవే రహదారులను వదిలేసి వీణవంక రహదారి మీదుగా రావడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. అయితే ఈ లారీలు జమ్మికుంట ప్రాంతం నుండి రావడం లేదని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. వే బిల్లు రూట్ మ్యాప్ కాకుండా దారితప్పి ఇవి మానకొండూరు మీదుగా వెల్లడం వెనక ఆంతర్యం ఎంటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అలాగే జమ్మికుంట నుండి వెల్లే లారీలు హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట సమీపంలో హైవే ఎక్కితే ఓ టోల్ గేట్ కూడా తగ్గుతుందని దీనివల్ల లారీ యజమానికి కూడా డబ్బు ఆదా అవుతుంది కదా, అలాంటిది మానకొండూరు మీదుగా అయితే అదనంగా మరో టోల్ గేట్ కు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది కదా వీరు జమ్మికుంట నుండి మానకొండూరు మీదుగా రావడం వెనక ఆంతర్మం ఏంటన్నదే పజిల్ గా మారింది. అయితే మానకొండూరు మండలంలోని కొన్ని గ్రామాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలోని ఇసుకను జీరోగా తరలిస్తున్నారా లేక వే బిల్లులు వేరే చోట తీసుకుని ఇక్కడి ఇసుకను రవాణా చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్కారు ఆదాయానికి గండికొడ్తూ ఇష్టారీతినో ఓవర్ లోడ్ ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమైన నేపథ్యంలో ఇక్కడ లారీలను స్థానికులు పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు మాత్రం ఈ లారీలను పంపించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అధికారులు నిభందనలకు విరుద్దంగా ఇసుక తరలిస్తున్న వీటిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

You cannot copy content of this page