మధ్యలో వెల్లిన బావ మృతి
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల పట్టణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తల్లి పెన్షన్ డబ్బుల కోసం అన్నదమ్ములు తన్నులాడుకోవడంతో అడ్డుగా వెల్లిన బావ మృత్యువాత పడడం స్థానికంగా విషాదాన్ని నింపింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… పట్టణంలోని విజయపురి కాలనీకి చెందిన అన్నదమ్ములు హయత్, తాజ్ లు శుక్రవారం తల్లికి వచ్చిన పెన్షన్ డబ్బులు రూ. 2వేల కోసం గొడవ పడ్డారు. తనకు కావాలంటే తనకంటూ ఇద్దరు కొట్లాడుకుంటున్న తీరును చూసి వారి బావ సయ్యద్ నయీం అడ్డుకునేందుకు వెల్లాడు. అన్నదమ్ములిద్దరూ నెట్టుకుంటున్న క్రమంలో నయీం కిందపడడంతో తలకు గాయం అయి చనిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న జగిత్యాల టౌన్ సీఐ రాంచందర్ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Disha Dasha
1884 posts