మజ్లీస్ అరాచకాల వెనుక బిఆర్ఎస్ హస్తం
ఎంఐఎం నేతలపై మంత్రి కమలాకర్ పై కేసు నమోదు చేయాలి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల ఓటమి తప్పదని
కొట్టె మురళీకృష్ణ
బిజెపి రాష్ట్ర నాయకులు
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్లో గత దశాబ్ద కాలంగా మజ్లీస్ అరాచకాల వెనుక బిఆర్ఎస్ హస్తం ఉందని రాబోయే ఎన్నికల్లో ఈ అరాచకాలకు వత్తాసు పలుకుతున్న మంత్రి గంగుల కమలాకర్ కు మెజారిటీ ప్రజలు ఓటుతో సమాధానం చెప్తారని బిజెపి రాష్ట్ర నాయకులు కొట్టె మురళీకృష్ణ అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలాగే గొడవలు సృష్టించి గంగుల కమలాకర్ వ్యవహరించిన తీరు ప్రజలంతా గమనించాలన్నారు గత ఎన్నికల్లో విజయం తర్వాత ఎంఐఎం జెండాతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన గంగుల కమలాకర్ గత ఐదేళ్లుగా హిందువుల మనోభావాలు ప్రతిసారి దెబ్బతిస్తూనే ఉన్నారని ఆరోపించారు మంత్రిగా తన పదవి కాలం అంతా మైనారిటీ ఓటు బ్యాంకు కాపాడుకునే ప్రయత్నం చేశారని గత కొద్ది రోజుల క్రితం ప్రగతి పథంలో ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ తో కరీంనగర్ ఎంఐఎం నేతలతో సమావేశమై కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఇంటిపై మరియు కార్యాలయం పై దాడులకు రూపకల్పన చేశారని ఆరోపించారు శుక్రవారం మిలాద్ ఉన్ నబి సందర్భంగా ఎంఐ నేతలు ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్ ఉద్దేశపూర్వకంగానే ర్యాలీ రూటును బండి సంజయ్ ఇంటి వద్దకు మరల్చారని ఆ ర్యాలీ నిర్వహించిన ఎంఐఎం నేతలపై మంత్రి గంగుల కమలాకర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అలజడలు సృష్టిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఎంఐఎం పార్టీ తీరుపై రాష్ట్ర మంత్రి గొంగల కమలాకర్ అండదండల తీరుపై కరీంనగర్ ప్రజలు రాబోయే ఎన్నికల్లో తీర్పు సమయం ఆసన్నమైందన్నారు