ఒకే వేదికపై ఆశావాహులు…

సిట్టింగ్ కు పోటీగా ప్రయత్నాలు

ప్రజలతో మమేకమయ్యేందుకు యాత్రలు

రామగుండం ముఖచిత్రంలో సరికొత్త ఎత్తులు

దిశ దశ, పెద్దపల్లి జిల్లా:

అంతా సవ్యంగా సాగుతుందనుకున్న క్రమంలో అక్కడి నేతకు సొంత పార్టీలోనే వ్యతిరేక కుంపటి మొదలైంది. ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరించకుండా ఆశా వాహులంతా కూడా ఓకే వేదికపైకి వచ్చి తమ లక్యం చేరుకోవాలన్న ప్రయత్నాల్లో మునిగి పోయినట్టుగా కనిపిస్తోంది. తాజాగా నెలకొన్న ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సరికొత్త సమస్యను తెచ్చిపెట్టాయనిపిస్తోంది.

కోరుకంటికి కొరకరాని కొయ్యలుగా

పెద్ధపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా జట్టు కట్టిన నాయకులు చాపకింద నీరులా పావులు కదపడం ఆరంభించారు. తాజాగా వీరంతా ఒకే చోట సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. చందర్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆశావాహులు జెడ్పీటీసీ సంధ్యారాణి, టి.బి.జి.కే.ఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజీ రెడ్డి, మాజీ మేయర్ లక్ష్మీ నారాయణ, సీనియర్ నాయకుడు ఎల్లయ్యలు చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో తమలో ఎవరికో ఒకరికి టికెట్. రావాలన్న లక్ష్యంతో అధిష్టానం వద్దకు వెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం. సిట్టింగ్ కోరుకంటి మైనస్ లన్నింటిని అధిష్టానం పెద్దల ముందు ఉంచి తమ పంథాన్ని నెగ్గించుకునే విధంగా పావులు కదపాలని చూస్తున్నట్టు సమాచారం.

యాత్రలతో ప్రజల్లోకి…

అటు అధిష్టానం ఇటు ప్రజా క్షేత్రం.. రెండు వైపులా తమ ప్రయత్నాలు సాగించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు వీరంతా.
ఇందులో భాగంగా ఇప్పటికే బస్తి, పల్లె, గనులు, భరోసా యాత్రల పేరుతో జనాల్లోకి వెళ్తూ వీరు ముమ్మరంగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాత్రం ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగేయాలని భావిస్తున్నట్టు సమాచారం. వ్యతిరేకంగా జట్టు కట్టిన నాయకులను ఆయన ఎలా తనకు అనుకూలంగా మల్చుకుంటారోనన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త ఎత్తుల్లో అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి చివరకు విక్టరీ అందుకునేదేవరన్నదే

You cannot copy content of this page