మోడీ, షాల మెప్పుకోసమే విగ్రహం తొలగిస్తామంటున్నారు: మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ధ్వజం

దిశ దశ, కరీంనగర్:

సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యనించడం పట్ల రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆక్షేపించారు. ప్రధాని నరేంద్ర మోది, హోం మంత్రి అమిత్ షాల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహం తొలగిస్తామంటున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. విగ్రహం తొలగింపు విషయంలో ప్రజలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరాడని, దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిచన ఘనత రాజీవ్ గాంధీదేనన్నారు. అలాగే 18 ఏండ్లకు ఓటు హక్కు తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవెర్చింది సోనియాగాంధీ అని, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తే దాని అర్థం తెలియని వ్యక్తులు విగ్రహం గురించి మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నాని మంత్రి ప్రకటించారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయవద్దా, రుణ మాఫీ చేయవద్దా వీటి కోసమే అప్పులు చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక వనరుల గురించి ప్రధాని మోడీకి తెలుసని, దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ భాగస్వామ్యం కీలకంగా మారిందన్నారు. గతంలో అప్పులు చేసి దుబారా చేశారని, ఇప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. గత పదేళ్లలో నిర్భందంలో ఉన్నామని, మార్పు కోరుకున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నామన్నారు. ఫైబర్ నెట్ వర్క్ ద్వారా టీ ఫైబర్ ద్వారా కేంద్రం సహకారంతో ప్రతి గ్రామానికి సేవలందించే చర్యలు కొనసాగుతున్నాయని, 8 వేల గ్రామాల ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఏఐ టెక్నాలజీతో గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని రెండు నెలల్లో పైలెట్ ప్రాజెక్టు పనులు చేపడతామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అనే అంశం శాసనసభ స్పీకర్ పరిధిలోనిదని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page