దిశ దశ, న్యూ ఢిల్లీ:
సేవ్ మణిపూర్, డిల్లీ ఆర్డినెన్స్ విత్ డ్రా నినాదాలతో పార్లమెంట్ వెలుపల బీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ముందు ప్ల కార్డులు పట్టుకుని ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సభలో ప్రవేశ పెట్టిన సందర్భంగా కూడా బీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయగా, పార్లమెంట్ సెషన్స్ ప్రారంభించినప్పటి నుండి కూడా మణిపూర్ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్లమెంటులోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నినసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్నారు. ఈ ఆందోళనల్లో ఎంపీలు కేకే, నామ నాగేశ్వరరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, దామోదర్ రావు, రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, రాములు, వద్దిరాజు రవిచంద్రలు పాల్గొన్నారు.
Disha Dasha
1884 posts
Next Post