ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇచ్చిన బీఆర్ఎస్….

దిశ దశ, న్యూ ఢిల్లీ:

లోకసభలో అబద్దాలు చెప్పారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. నిషికాంత్ దూబే ఉద్ధేశ్యపూర్వకంగానే సభను తప్పదారి పట్టించారంటూ రూల్ 222 కింద ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు లోకసభలో బీఆర్ఎస్ పక్షనేత నామ నాగేశ్వర్ రావు మీడియాకు వెల్లడించారు. బుధవారం లోకసభలో కాలేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 86 వేల కోట్ల ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ లోకసభ సభ్యుడు నిషికాంత్ దూబే తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పదారి పట్టించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సభ్యులను నమ్మించేందుకే ఈ విధంగా వాఖ్యానించారంటున్నారు. స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీల్లో నామ నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాలోతు కవిత, రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ ఉన్నారు.

You cannot copy content of this page