దిశ దశ, వరంగల్:
రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినట్టయతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి తీరుతారని, బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, తన రాజకీయ జీవితంలో ఎగిరిన వాళ్లంతా కనుమరుగయ్యారని మండిపడ్డారు. నైతిక విలువల గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వల్లిస్తున్నతీరు విస్మయం కల్గిస్తోందని, పదేళ్ల పాలనలో పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించిన చరిత్ర ఆ పార్టీదేనని వ్యాఖ్యానించారు. ఆయా రాజకీయ పార్టీల శాసన సభ, మండలి పక్షాలను కూడా పార్టీలో విలీనం చేయించుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. 38 ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకుని ఇప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి