దిశ దశ, వరంగల్:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అవుతోంది. వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లోని వరద నీరు ప్రధాన రహదారులపైకి రావడంతో రవాణా వ్యవస్త ఎక్కడికక్కడ స్తంభించిపో్యింది. ఈ వర్షాల ప్రబావం ఎక్కువగా మహబూబాబాద్ జిల్లాపై తీవ్రంగా పడింది. వనంగల్, మహబూబాబాద్ మార్గంలో వరద నీరు ఉధృతంగా పొంగి పొర్లుతుండడంతో ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి నుండి రోడ్డుపైనే నిలిపి ఉంచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుండి మహబూబాబాద్ వెల్తున్న ఆర్టీసీ బస్సు నంబర్ TS24Z 0018 శనివారం రాత్రి రహదారిపోయిన నిలిపి ఉంచారు. నెక్కొండ మండలం వెంకటాపురం చెరువు, తోపనపల్లి చెరువుల్లోకి నీరు పెద్ద వచ్చి చేరింది. దీంతో తోపనపల్లి రహదారిపైకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులు శనివారం రాత్రి నుండి అక్కడే చిక్కుకపోయారు. వరద ఉధృతి కారణంగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్య తమను సమీప గ్రామంలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. రాత్రి నుండి నిరాటంకంగా కురుస్తున్న వర్షాల మార్గమధ్యలోనే చిక్కుకపోవడంతో కనీసం తాగడానికి కూడా నీరు లేదని, బస్సులు చిన్నారులు, వృద్దులు కూడా ఉన్నారని ప్రయాణీకులు చెప్తున్నారు. తమను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వేడుకొంటున్నారు.