దిశ దశ, హైదరాబాద్:
హైదరాబాద్ నుండి నడుచుకుంటూ వెల్తున్న ఓ వ్యక్తి 108కి కాల్ చేశాడు. అర్థరాత్రి ఫోన్ రావడంతో హుటాహుటిన 108 అంబూలెన్స్ లో వెల్లిన సిబ్బంది అతని వద్దకు చేరుకున్నారు. ఆరోగ్యంగా ఉండడంతో పాటు మందు తాగినట్టుగా ఉన్న అతన్ని చూసిన 108 సిబ్బందికి అనుమానం వచ్చి ప్రశ్నించారు. తన పేరు రమేష్ అని తాను జనగామ సమీపంలోని ఉంటున్న తన అమ్మమ్మ ఇంటి వద్ద దించాలని కోరాడు. ఎమర్జెన్సీ సర్విసెస్ అందిస్తాం కానీ ఇంటి వద్ద దింపడానికి కుదరదని 108 సిబ్బంది చెప్పారు. తాను కూడా ఎమర్జెన్సీ పని ఉండే ఫోన్ చేశానని జనగామలో దింపాలని కోరాడు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెల్తాం కానీ మీ లాంటి వారిని కాదని 108 సిబ్బంది చెప్పగా తాను కూడా అపస్మారక స్థితికి చేరుకుంటున్నానని నడవలేకపోతున్నానంటూ మందుబాబు సమాధానం ఇచ్చాడు. ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉన్నట్టయితే ఆసుపత్రిలో చేర్పిస్తాం కానీ తాము ఇంటి వద్ద దించడం కుదరదని చెప్పినా వినకుండా సదరు వ్యక్తి తనకు కూడా ఆరోగ్య సమస్య ఉందంటూ బదులిచ్చాడు. భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్పిస్తాం కానీ జనగామ వరకు అయితే తాము రావడం కుదరదని సిబ్బంది చెప్పగా తాను జనగామలో మాత్రమే దిగుతానని అక్కడే దింపాలని పట్టబట్టడం విచిత్రం.
హైదరాబాద్ శివార్లలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఈ క్రింది లింక్ ద్వారా చూడండి…
https://youtu.be/hCt-ojQzVAg