దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. అధికారికంగా విడుదలైన ఈ షెడ్యూల్ ప్రకారం ఈ సారి కూడా హుస్నాబాద్ నుండే తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధినేతగా సభల్లో ప్రసంగించిన ఉద్యమనేత ఈ సారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉపన్యాసించనున్నారు.
ఆ రెండూ కూడా….
ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో హుస్నాబాద్ సెంటిమెంట్ గా భావిస్తున్నారని అనుకుంటుంటాం. కానీ ఇందులో మరో కోణం కూడా దాగి ఉందన్న విషయం చాలా మందికి గమనించకపోవచ్చు. ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న వొడితెల సతీష్ బాబు ఫ్యామిలీ కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. స్వరాష్ట్ర కల సాకారం కోసం డిప్యూటీ స్పీకర్ గా అండర్ గ్రౌండ్ లో ఉంటూ సమీకరణాలు చేసిన కేసీఆర్ కు మొదట అండగా నిలిచింది కూడా వొడితెల బ్రదర్సే. మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వర్ రావు, కెప్టెన్ లక్ష్మీ కాంతరావులు కేసీఆర్ చేపట్టే ప్రతి వ్యూహంలోనూ ఈ అన్నదమ్ములిద్దరు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. వొడితెల రాజేశ్వర్ రావు మరణానంతరం కూడా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం అంతా కూడా కేసీఆర్ తో కలిసి నడిచింది. హుస్నాబాద్ నుండి ప్రచారాన్ని ప్రారంభించినట్టయితే అన్ని విధాలుగా సక్సెస్ అవుతామని కూడా ఆయనకు వాస్తు శాస్త్ర పండితులు చెప్పడంతో మొదట అక్కడి నుండే తన ప్రచార పర్వాన్ని మొదలు పెట్టారు. అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ కేసీఆర్ ఈ ఎన్నికల్లోనూ హుస్నాబాద్ లోనే తొలి సభ ఏర్పాటు చేస్తున్నారు. అటు ఈశాన్య ప్రాంతంగా భావించే హుస్నాబాద్ తో పాటు మరో వైపున ఉద్యమం నుండి కూడా అన్నింటా అక్కున చేర్చుకున్న వొడితెల కుటుంబానికి చెందిన సతీష్ బాబు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో కలిసి వచ్చిందని కేసీఆర్ నమ్ముతున్నారని అంటున్నారు.
అక్కడి నుండే…
అయితే కేసీఆర్ రాష్ట్రం నలుమూలల చుట్టివచ్చేందుకు ఖరారయిన షెడ్యూల్ ను కూడా అమలు చేసేందుకు ఎర్రవెల్లి పాం హౌజ్ వేదికగానే కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫాం హౌజ్ నుండే కేసీఆర్ రోజు వారి ప్రచారాలు నిర్వహించిన 9వ తేది ఒంటి గంట నుండి 2 గంటల్లోగా గజ్వేల్ లో 2 నుండి 3 గంటల నడుమ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్న ముఖ్యమంత్రి ఆ తరువాత కామారెడ్డిలో జరిగే చివరి బహిరంగ సభలో ప్రసగించి తన ప్రచార పర్వాన్ని నిలిపివేయనున్నారు.