వెలుగులోకి వస్తున్న కెనడా తీరు
దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఖలిస్తాన్ పేరిట వేర్పాటు వాదులను కెనడా పెంచి పోషిస్తున్న తీరు ఇప్పటి నుండే కానట్టుగా ఉంది. ఈ విషయంలో కెనడా కొత్త పల్లవి ఎత్తుకున్నది కాదని… చరిత్ర లోతులు తవ్వితే తెలుస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ తప్పు చేసిందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రచారానికి తెరలేపినప్పటికీ వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. దౌత్య సంబంధాలు సాఫీగా కొనసాగించే తీరుకు భిన్నంగా వ్యవహరించడం ఇప్పుడే కాదు 1980వ దశాబ్దంలోనూ సాగినట్టుగా తెలుస్తోంది. 1982లోనే ఖలిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో బారత్ కెనడా ప్రధానిని అలెర్ట్ చేసింది. ప్రస్తుత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ట్రూడో 1982 ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో కూడా ఖలిస్తాన్ టెర్రరిస్టుల అంశాన్ని భారత ప్రభుత్వం లేవనెత్తి సహాయ నిరాకరణ చేయాలని సూచించింది. బబ్బర్ ఖల్సా ఉగ్రవాది తల్విందర్ పర్మార్‌ను అప్పగించాలని పియరీ ట్రూడోను భారత్ కోరినా సానుకూలంగా వ్యవహరించలేదు. దీని పర్యవసనంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టడంతో 329 మంది చనిపోయారు. ఇప్పుడు కూడా తన తండ్రి పియరీ ట్రూడో బాటలోనే ప్రస్తుత కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో భారత్ లో ఉగ్ర వాదుల కార్యకలాపాలకు ఆజ్యం పోస్తున్నట్టుగా దేశ వ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. కెనడా భూ భాగంలో షెల్టర్ తీసుకుంటున్న వేర్పాటు వాదులు భారత్ లో విచ్ఛినకర శక్తులుగా తయారయ్యారని అలాంటి వారిని ప్రోత్సహించవద్దని కూడా ఆ దేశం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ నాడు తన తండ్రిని భారత్ అభ్యర్థిస్తే స్పందించకపోగా… జూనియర్ ట్రూడో అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా భారత్ పైనే ఎదురు దాడి మొదలు పెట్టడం విస్మయం కల్గిస్తోంది. ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిన కెనడా తప్పిదాలను భారత్ ఎత్తి చూపితే అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకోవల్సి వస్తుందని ముందు జాగ్రత్త పడినట్టుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
హర్దీప్ సింగ్ పై అభియోగాలు…
అయితే గత జూన్ లో హత్యకు గురైన ఖలీస్తాన్ వేర్పాటువాద ప్రేరేపిత ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ గురించి భారత్ చేస్తున్న వాదనలు అత్యంత బలంగా ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా ఉన్న ఆయన కోసం ఇక్కడి టెర్రరిస్ట్ యాంటీ స్క్వాడ్స్ వేటాడుతూనే ఉన్నాయి. 1997లో నకిలీ ఐడీ ప్రూఫ్ తో కెనాడాకు వెల్లిన ఆయన కెనడియన్ ఇమ్మిగ్రేషన్ అధికారులను కూడా తప్పుదారి పట్టించాడు. అక్రమ వసల వెళ్లడానికి సహకరించిన బ్రిటీష్ కొలంబియన్ ను వివాహం చేసుకున్న నిజ్జర్ జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనలో లో సభ్యత్వం తీసుకున్నాడు. కొంతకాలానికి ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) స్థాపించి ఖలీస్తాన్ వేర్పాటు వాదులతో కనెక్టివిటీ కల్పించడంతో పాటు వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం నిధులు సమకూర్చడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడు. భారత్ లో నిజ్జర్ పై పలు కేసులు నమోదయి అన్నాయని, పలు హత్య కేసుల్లో కూడా నిందితునిగా ఉన్నాడు. 2013 ప్రాంతంలో పాకిస్తాన్ కూడా సందర్శించిన నిజ్జర్ 1985 ఎయిర్ ఇండియాపై జరిగిన దాడుల్లోనూ పాలు పంచుకున్నాడని, సిక్ ఫర్ జస్టిస్ వంటి టెర్రర్ సంస్థలతో క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తున్నాడని కూడా భారత్ ఆరోపిస్తోంది. థాయిలాండ్ లో అరెస్ట్ అయిన కేటీఎఫ్ నేత జగ్తార్ సింగ్ తారను కూడా కలుసుకున్నాడని భారత్ వాదిస్తోంది.
తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ అంశం గురించి స్పందిస్తూ సిక్కు వేర్పాటువాద నేత నిజ్జర్ హత్యతో భారత్ ఏజెంట్లకు సంబంధం ఉందని చెప్పి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం లేదంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నామని. ఈ అంశాన్ని భారత్ సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నామని మీడియాతో వ్యాఖ్యానించారు. ఓ వైపున భారత దౌత్యధికారులను వెనక్కి వెల్లిపోవాలని చెప్పి భారత్ నుండి కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ అయిన తరువాత కెనడా ప్రధాని స్పందించిన తీరు ఇలా ఉంది. ఏది ఏమైనా యూకె ప్రధాని సునాక్ భారత్ తో ట్రేడ్ జరపడానికే మొగ్గు చూపుతున్నట్టుగా ప్రకటించగా అంతర్జీతీయంగా కూడా కెనడాకు అనుకూలమైన స్పందన రాకపోవడం గమనార్హం.