జబర్దస్త్ కమెయడిన్ ఆటో రాంప్రసాద్‌కు క్యాన్సర్? క్లారిటీ ఇచ్చిన నటుడు

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కు క్యాన్సర్ బారిన పడ్డారనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా జరుగుతోంది. ఇటీవల సర్జికల్ క్యాప్ పెట్టుకుని కనిపించడం, ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో.. క్యాన్సర్ వచ్చిందనే ప్రచారం బుల్లితెర వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. దీంతో ఆటో రాంచప్రసాద్ కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రచారం అతడి అభిమానులు, ఫ్రెండ్స్ ను ఆందోళన కలిగించింది. దీంతో స్నేహితులు అతడికి ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలో తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై ఆటో రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి క్యాన్సర్ రాలేదని, బయట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. తాను తలకు క్యాప్ పెట్టుకోవడంతో ఏదో జరిగిందని ప్రచారం జరుగుతుందని, నాకేందో అయిందని అందరూ ఆందోళన పడుతున్నారని అన్నాడు. కానీ తాను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నానని, అది తప్పితే తనకు ఏం కాలేదని తెలిపాడు. తనకు ఏం కాలేదని,తన స్నేహితులు, అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆటో రాంప్రసాద్ చెప్పాడు.

తనకు ఏమైనా అయితే చూసుకోవడానికి మీరు ఉన్నారుగా అంటూ అభిమానులను ఉద్దేశించి ఆటో రాంప్రసాద్ చెప్పాడు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడంతో సర్జికల్ క్యాప్ పెట్టుకున్నానని, అంతేకానీ తనకు క్యాన్సర్ ఏం రాలేదని తెలిపాడు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ మణికొండలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెండో బ్రాంచ్ ను స్టార్ట్ చేశాడు. ఈ ప్రారంభోత్సవంలో హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాంప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ.. తాను హస్పిటల్ లో ఉన్న ఫొటో వైరల్ కావడంతో ఆందోళన పడ్డారని, కానీ తనకు ఏం కాలేదన్నాడు.కాగా తన ఆటో పంచులతో రాంప్రసాద్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

You cannot copy content of this page