నాసా తయారు చేసిన క్యాప్సుల్ చంద్రుని వద్దకు చేరుకుంది. అక్కడి చిత్రాలను బంధించి నాసా పరిశోధన కేంద్రానికి కూడా పంపించింది. మానవ రహిత ఓరియన్ క్యాప్సుల్ చంద్రుడి వెనక కక్ష్యలో 80 మైళ్ల దూరానికి చేరినట్టుగా పరిశోధకులు చెప్తున్నారు. మానవ రహిత ఓరియన్ క్యాప్సుల్ కక్ష్యలోకి ప్రవేశించినప్పుడు అరగంట పాటు కమ్యూనికేషన్ నిలిచిపోయిందని, చంద్రుడి ముందు భాగానికి చేరుకున్న సమయంలోనే ఇలా జరిగిందని అంచనా వేస్తున్నారు. చంద్రుడి ముందు భాగం నుండి తిరిగి వచ్చే వరకూ ఇంజన్ ఫైరింగ్ ఉందో లేదో హుస్టన్ లోని కంట్రోల్ కేంద్రానికి ఎలాంటి సమాచారం అందలేదు. ఒరియాన్ బయటకు వచ్చిన తరువాత కిందకు చిత్రాలను పంపించిందని డైరెక్టర్ జెబ్ స్కోవిల్లే వెల్లడించారు. నీలి చుక్క చుట్టూ చీకటిగా ఉందని, అన్ని సక్రమంగా ఉన్నట్టయితే శుక్రవారం మరోసారి ప్రయోగిస్తామన్నారు.
1970 రికార్డ్ బ్రేక్…
ఇకపోతే ఓరియన్ క్యాప్సుల్ 1970 నాటి రికార్డు బ్రేక్ చేయనుందని నాసా అధికారులు చెప్తున్నారు. మరో వారం రోజుల్లో భూమికి నాలుగు లక్షల కిలోమీటర్ల దూరం చేరుకుని ఓరియన్ 1970లో అపోలో 13 రికార్డును బద్దలు కొట్టనుందన్నారు. ఆ తరువాత చంద్రుడి కక్ష్యలోనే వారం రోజుల పాటు తిరగి భూమికి చేరుతుందని, డిసెంబర్ 11న పసిపిక్ మహా సముద్రంలో క్యాప్పుల్ ను దించేందుకు ప్రయత్నిస్తున్నామనారు. అర్టెమిస్ మిషన్ 1 మానవ రహిత ఓరియన్ క్యాప్సుల్ ప్రయోగం పూర్తయిన తర్వాత చంద్రుడిపై వ్యోమోగాములను కూడా పంపిచే యోచనలో నాసా ఉంది.