నటుడు షారుక్​ భార్య గౌరీ ఖాన్‌పై కేసు

బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై చీటింగ్ కేసు నమోదు అయింది. ఓ ప్లాట్ విక్రయానికి సంబంధించి తనను మోసం చేశారని పేర్కొంటూ ముంబైకి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూపీలోని లక్నోకు చెందిన తులసియానీ కంపెనీ ఒక వ్యక్తికి ప్లాటును అమ్మింది. సకాలంలో ప్లాటును తనకు ఇవ్వకుండా వేరే వారికి విక్రయించారని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్​ ప్రమోట్ చేయడం వల్లనే ప్లాటును కొనుగోలు చేశామని..ఇప్పుడు కంపెనీ వారు మోసం చేశారని వారిపై బాధితుడు కేసు నమోదు చేశాడు. బాధితుడు ఫిబ్రవరి 25న కేసు నమోదు చేసినట్లు సమాచారం.

2015 సంవత్సరంలో గౌరీ ఖాన్​ లక్నోకు చెందిన తులసియానీ కంపెనీని ప్రమోట్ చేశారు. షాహిద్‌​పాత్‌​లో తులసియానీ కంపెనీ.. ఒక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తోంది. గౌరీ ఖాన్​ ప్రకటనను చూసిన తర్వాత ముంబైలోని అంధేరీ ఈస్ట్ ప్రాంతానికి కిరీట్ జస్వంత్ సాహ్.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని, డైరెక్టర్ మహేష్ తులసియానిని సంప్రదించాడు. వారిద్దరూ రూ.86 లక్షలకు ప్లాటును అమ్మడానికి డీల్ ఫిక్స్ చేశారు.

బ్యాంకు నుంచి రూ.85.46లక్షలు అప్పు తీసుకుని ప్లాటుకు కట్టానని బాధితుడు చెప్పాడు. 2016 అక్టోబర్‌​లో ప్లాటును రిజిస్ట్రేషన్​ చేసి అప్పగిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. తర్వాత కంపెనీ సరైన సమయంలో కంపెనీ ప్లాటును అప్పగించనందుకు పరిహారంగా రూ.22.70లక్షలు చెల్లించి ఆరు నెలల్లో ప్లాటును అప్పగిస్తామని చెప్పింది. ఇది విఫలమైతే ఇచ్చిన డబ్బులకు వడ్డీతో పాటు మొత్తం తిరిగి ఇస్తామని కంపెనీ చెప్పింది.

మరోవైపు కంపెనీ ఆ ప్లాటును వేరొకరి పేరు మీద విక్రయించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు బాధితుడికి తెలిసింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గౌరీ ఖాన్, తులసియాని కంపెనీ ఎండీ, డైరెక్టర్‌పై సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కిరీట్ జస్వంత్ సాహ్ ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ తులసియానీ, మహేష్ తులసియానీ, గౌరీ ఖాన్‌లపై అక్రమాస్తుల సెక్షన్ల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

You cannot copy content of this page