బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్శిటీ: కేసు నమోదు

దిశ దశ, హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబానికి చెందిన విద్యా సంస్థలపై కేసు నమోదు అయింది. అనురాగ్ యూనివర్శిటీ బఫర్ జోన్ లో ఉందని ఘట్ కేసర్ ఇరిగేషన్ ఏఈఈ ఏ పరమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎప్ఐఆర్ జారీ చేశారు పోలీసులు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఆర్ నంబర్ 390/2024లో 329(3), 324 (4), 279 బీఎన్ఎస్  పీడీపీపీఏ యాక్టులో ఈ మేరకు కేసు నమెదు చేశారు. ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ యూనివర్శిటీ నిర్మించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా నిర్మించిన ఈ విద్యా సంస్థలకు సంబంధించిన విషయంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.

You cannot copy content of this page