KARIMNAGAR: డంప్ యార్డ్ వద్ద కళేబరాల షెడ్స్… సమీప కాలనీల్లో దుర్గంధం

దిశ దశ, కరీంనగర్:

ఈ నగరానికి ఏమైంది..? కాలుష్యం కోరల్లో చిక్కుకుని ప్రజలు విలవిలలాడడానికి కారణమేంటీ..? ఓ వైపున డంప్ యార్డు దుర్గంధంతో ఇబ్బంది పడుతుంటుంటే… పశువుల ఎముకలు, కళేబరాలను తీసుకొచ్చి స్టోర్ చేస్తుండడంతో దుర్వాసన మరింత వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ రాంమగుండం బైపాస్ రోడ్డులోని డంప్ యార్డు మాటున జరుగుతున్న తీరుపై దృష్టి పెట్టేవారు లేకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డంప్ యార్డు వద్ద…

కరీంనగర్ డంప్ యార్డు సమీపంలో నాలుగైదు తాత్కాలిక షెడ్లు నిర్మించారు. ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరిపినా చర్యలు తీసుకోవల్సి ఉన్నప్పటికీ అటుగా వెల్లేవారు ఎవరై లేకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా నడుస్తోంది. సిమెంట్ బ్రిగ్స్ తో గోడలు నిర్మించి ఫ్లెక్సీలు, రేకులు వేసి పశువుల కళేబరాలు, ఎముకలు, కొమ్ములు తీసుకొచ్చి నిలువ ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో పశువులను కోసిన తరువాత వృధా అయ్యే పేగులు, చర్మం, ఎముకలు, కొమ్ములు, తల కాయలు వంటివి తీసుకొచ్చి ఈ షెడ్లలో స్టాక్ పెడుతున్నారు కొందరు. సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కొమ్ములు, ఎముకలు, తల కాయలు, చర్మం, పేగులను ఎండబెడుతున్నారు. అవి ఎండిపోయిన తరువాత హైదరాబాద్ కు ఎగుమతి చేస్తున్నారు. అయితే పశువులను ఆహారం కోసం కోసిన తరువాత మిగిలిపోతున్న వాటిని ట్రాలీ ఆటోలలో డంప్ యార్డు సమీపంలోని ఈ నిర్మాణాల వద్దకు తరలించి వాటిని ఎండబెడుతున్నారు. తాత్కాలిక షెడ్ల సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో వీటిని ఎండబెట్టి వారానికి మూడు నుండి నాలుగు డీసీఎం వ్యాన్లలో హైదరాబాద్ కు తరలిస్తున్నారని స్థానికలు తెలిపారు.

దుర్గంధం…

అయితే డంపింగ్ యార్డు సమీపంలో 8 నుండి 10 ఏళ్లుగా పశువుల కళేబరాలలో మిగిలిపోతున్న వాటిని ఇక్కడకు తీసుకొస్తుండడంతో ఈ ప్రాంతమంతా వాసన వెదజల్లుతోందని స్థానికులు తెలిపారు. దుర్వాసన సమీపంలోని ఆటోనగర్ తో పాటు కోతి రాంపూర్ లోని పలు వీధుల వరకూ వస్తోందని చెప్తున్నారు. ఈ దుగ్గంధం వెదజల్లుతుండడంతో అనారోగ్యాల బారిన కూడా పడుతున్నామని స్థానికులు తెలిపారు. డంప్ యార్డు వద్ద వేస్తున్న వీటిని తొలగించాలని, సమీప కాలనీల్లో నివాసం ఉంటున్న వారిని కాపాడాలని గతంలో పలుమార్లు మునిసిపల్ అధికారులకు, కలెక్టర్ కు విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. అవి ఎండిపోయిన తరువాత కూడా దుర్గంధం వస్తుందని హైదరాబాద్ నగరానికి తరలించేప్పుడు వాటిపై సుగంధ ద్రవ్యాలను స్ప్రే చేసి తరలిస్తుంటారని తెలుస్తోంది. వర్షాకాలంలో అయితే దుర్గంధం మరింత ఎక్కువగా వస్తుందని. పశువుల కళేబరాల వల్ల క్రిమికీటకాలు కూడా తయారవుతున్నాయి. దీంతో వివిధ రకాల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని, చిన్న పిల్లలు, వృద్దుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. డంప్ యార్డు సమీపంలో పశువుల కళేబరాలను తరలించి స్టోర్ చేస్తున్న వారిని కట్టడి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

You cannot copy content of this page