ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణలో పని చేస్తున్న ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం సీబీఐ ‘ఎక్స్’ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించింది. సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనరేట్ సూపరింటిండెంట్, ఇన్స్ పెక్టర్లపై ఈ కేసు ఈ కేసు నమోదు చేసింది. ఈ ఇద్దరు అధికారులు కూడా రూ. కోట్లు అక్రమ మార్గాల ద్వారా గడించారని, సీబీఐ అధికారులను ఆశ్రయించిన బాధితుడు వెల్లడించారని పేర్కొంది. అతని వద్ద కూడా రూ. 5 లక్షలు వసూలు చేశారని, బాధితునికి చెందిన ప్రైవేటు కంపెనీకి చెందిన ఐరన్ స్క్రాప్ విషయంలో అక్రమాలు జరిగియాని జులై 4న జీఎస్టీ అధికారులు సీజ్ చేశారని పేర్కొంది. అతని వద్ద రూ. 5 లక్షలు వసూలు చేసిన జీఎస్టీ అధికారులు రూ. కోటి డిమాండ్ చేశారని తెలిపింది. సీజింగ్ ఓపెన్ చేయాలంటే రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని కూడా సీబీఐ విచారణలో తేలింది. హైదరాబాద్ లోని రెండు చోట్ల సీబీఐ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించినప్పుడు ఇందుకు సంబంధించిన ఆధారాలు లంభించాయని కూడా సీబీఐ పేర్కొంది.

You cannot copy content of this page