బియ్యం కేంద్రానివి… లాభం మహారాష్ట్రకు…

దిశ దశ, హైదరాబాద్:

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న పీడీఎస్ బియ్యం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిందా..? పేదల కడుపు నింపేందుకు పంపిస్తున్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్ర ఖజానాను నింపుతోందా..? 

వయా తెలంగాణ

దేశంలోని ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా వైట్ రేషన్ కార్డు దారులకు ఉచితంగా రేషన్ బియ్యం అందించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉచితంగా అందించే బియ్యం స్కీంను మరో ఐదేళ్ల పాటు యథావిధిగా కొనసాగిస్తామని తాజాగా లోకసభ ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసినప్పుడు ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో బియ్యం వండుకుని తినే పేదల కడుపునింపాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఉచిత బియ్యం తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన వారికి కూడా సరఫరా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున పీడీఎస్ బియ్యం సరఫరా అవుతుండగా అంత్యోదయ కార్డు దారులకు నెలకు 35 కిలోల వరకు ఉచిత బియ్యం అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం స్మగ్లింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణాకు వచ్చి చేరుతున్న ఈ ఉచిత బియ్యంలో సింహ భాగం మహారాష్ట్రకు గుట్టు చప్పుడు కాకుండా తరలి వెల్తున్నాయి. మహారాష్ట్రలో బియ్యం రవాణా విషయంలో నియంత్రణ చేయాలన్న నిభందనలు లేకపోవడంతో ఇక్కడి బియ్యం అక్కడకు చేరుకోగానే… దర్జాగా రహాదారుల మీదుగా ఇతర  ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఇటీవల కాలంలో తీవ్రంగా పెరిగిపోయిన పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నీరుగారిపోతుండగా… ఈ బియ్యం ద్వారా అదనపు ఆదాయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం గడిస్తున్నట్టుగా  స్పష్టం అవుతోంది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యానికి అదే బీజేపీ, శివసేన కూటమి నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయాన్ని పొందుతోంది. పేదల కడుపు నింపాలన్న సంకల్పంతో చేపట్టిన ఈ స్కీం తమ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వ ఖజానానయితే నింపుతున్నట్టుగా స్పష్టం అవుతోంది.

ఎలా అంటే…

తెలంగాణ లబ్దిదారుల పేరిట వస్తున్న ఈ బియ్యానికి డబ్బులు చెల్లించి కొంటున్న దళారులు వాటిని మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణను ఆనుకుని ఉన్న ప్రాంతాలకు పీడీఎస్ రైస్ చేరుకుంటున్నాయి. సరిహధ్దున ఉన్న ఆయా ప్రాంతాలకు తెలంగాణ సబ్పీడీ బియ్యం టన్నుల కొద్ది తరలి వెల్తున్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దుల నుండి సబ్సీడీ బియ్యం మహారాష్ట్రకు చేరుతున్నాయి. అక్కడకు వెల్లిన తరువాత వ్యాపారులు ఈ బియ్యాన్ని లారీల్లో తరలించేందుకు సిద్దం చేసి మహారాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేస్తున్నారు. వాహనాన్ని బట్టి రూ. 3 వేల నుండి 5 వేల వరకు సంబంధిత శాఖ అధికారులకు డబ్బులు చెల్లించి రశీదు పొందుతున్నారు. ఆ తరువాత ఈ బియ్యాన్ని రాష్ట్రంలో ఎక్కడికైనా తరలించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణ సబ్సీడీ బియ్యం మహారాష్ట్రకు చెల్లిస్తున్న ట్యాక్స్ ఆ ప్రభుత్వ ఖాతాలో జమ అవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం ద్వారా బీజేపీ, శివసేన కూటమి పరిపాలిస్తన్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా ఉచితంగానే జమ అవుతున్నట్టు అవుతోంది. ఇటీవల కాలంలో బియ్యం రవాణాపై వస్తున్న ఆదాయంపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టయితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. కానీ ఆదాయం వస్తోందన్న భావనతో ఆయా జిల్లాల అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఫ్రీ రైస్ తో ఫ్రీ రెవెన్యూ మహారాష్ట్ర ప్రభుత్వం ఖజనాలో చేరుతోంది.

లక్ష్యానికి గండి… 

విచిత్రం ఏంటంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో సదుద్దేశ్యంతో అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకానికి అదే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా గండి కొడ్తున్నట్టుగా తయారైంది. పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ స్కీంను బీజేపీ జాతీయ నాయకత్వం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకుంటుంటే… ఇదే స్కీం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం ఎన్డీఏ పరిపాలిత మహారాష్ట్ర తన ఖజనాలో వేసుకుంటోంది. 

You cannot copy content of this page