ఎగుమతుల నిషేధం… ఎగబడుతున్న జనం

విదేశాల్లో కిక్కిరిసి పోతున్న గ్రాసరీ స్టోర్స్

దిశ దశ, అంతర్జాతీయం:

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం విదేశాల్లోని ఇండియన్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఎన్ ఆర్ ఐ లు ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ లలో క్యూ కడుతున్నారు. దీంతో ఇండియన్స్ ఉన్న ప్రాంతాల్లోని గ్రాసరీ స్టోర్స్ లో పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ కూడా సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది.

ఇంతకీ ఏమైందంటే..?

విదేశాలకు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. దీంతో విదేశాల్లో ఉన్న ఎన్నారైలు తమకు అలవాటైన రైస్ వండుకుని తినే పరిస్థితి ఉండదన్న ఆందోళనతో తమ ఇండ్డలో బియ్యం పెద్ద ఎత్తున నిలువలు పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ గ్రాసరీస్ విక్రయించే స్టోర్ల వద్ద ఇండియన్స్ క్యూ కట్టి మరీ బియ్యం కొనుగోళ్లు చేసేందుకు ఎగబడుతున్నారు. ఒక్కో ఫ్యామిలీ 5 బ్యాగుల వరకు రైస్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిన్న మొన్నటి వరకు తమ అవసరాలకు తగ్గట్టుగా బియ్యం కొనుగోలు చేసుకున్న ఎన్నారైలు ఇప్పుడు స్టాక్ పెట్టుకునేందుకు పెద్ద సంఖ్యంలో రైస్ బ్యాగ్స్ పర్చేజ్ చేస్తున్నారు. ప్రధానంగా బాస్మతేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించగా, పారా బాయిల్డ్ నాన్ బాస్మతి రైస్ ఎక్స్ పోర్ట్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇతరాత్ర రకాల బియ్యం తమకు అందుబాటులో ఉండే అవకాశం లేదని కలవరపడుతున్న విదేశాల్లో స్థిరపడ్డ భారీతీయులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు. ఒక్కో ఫ్యామిలీ కనీసం ఆరు నెలలకు సరిపడా బియ్యం కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికాలో కొన్ని ఇండియన్ గ్రాసరీస్ స్టోర్స్ లలో అయితే ఒక్కో బ్యాగుకు అదనంగా నాలుగు డాలర్ల ధరను పెంచి మరీ విక్రయిస్తున్నారు. ఇప్పట్లో భారత్ బియ్యం అందుబాటులో ఉండవదన్న కారణంగానే ఎన్నారైలు పెద్ద ఎత్తున గ్రాసరీ స్టోర్స్ బాట పట్టగా ఇందుకు తగ్గట్టుగానే అక్కడి వ్యాపారులు కూడా ధరలను పెంచి మరీ విక్రయిస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page