వరద బీభత్సాన్ని పరిశీలించనున్న కేంద్ర బృందం


దిశ దశ, హైదరాబాద్:

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతులం అయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ మేరకు శనివారం కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తుల నివారణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విపత్తుల నివారణ సలహాదారు కునాల్ సత్యార్థి ఆధ్వర్యంలో వ్యవసాయం, ఫైనాన్స్, జలశక్తి, రోడ్డు రవాణ హైవేలు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) స్పేస్ విభాగాలకు చెందిన ప్రతినిధులు ఈ బృందంలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం నుండి రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించే నివేదికలు, కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలించి సిద్దం చేసిన పూర్తి రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని హోంశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. నైరుతి రుతపవనాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించే కేంద్ర బృందం కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం అందించేందుకు అవసరమైన నివేదిక అందించడంతో పాటు దీనిని తీవ్రమైన ప్రకృతి విధ్వంసగా గుర్తించాలో లేదో కూడా ఆ నివేదికలో పేర్కొంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను స్టడీ చేసి రెండో సారి కూడా ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి ఫైనల్ రిపోర్ట్ అందజేయనుంది.

You cannot copy content of this page