దిశ దశ, భూపాలపల్లి:
మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి చెందిన నిపుణుల బృందం మంగళవారం పరిశీలించింది. ఛైర్మన్ అనిల్ జైన్ నేతృతవంలోని ఆరుగురు సభ్యులు కె శర్మ, ఆఱ్ గంగామని, రాహుల్ కె సింగ్, దేవేందర్ రావు, సీఈకేజీబీఓ నామినేట్ చేసిన మరో సభ్యుడు మంగళవారం మద్యాహ్నం మేడిగడ్డకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్యారేజ్ లోని 20వ పిల్లర్ ను పరిశీలించిన బృందం సాంకేతిక వివరానలు అడిగి తెలుసుకుంది. ఈ బ్యారేజ్ నిర్మాణం కోసం వినియోగించిన మెటిరియల్ తో పాటు, పిల్లర్ల కోసం చేపట్టిన సాయిల్ టెస్ట్ తదితర అంశాలపై ఇరిగేషన్, ఎల్ అండ్ టి అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అయితే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ అమలు చేయడంత కేవలం అధికారులను మాత్రమే అనుమతించారు. మిగతా వారంతా కూడా బ్యారేజ్ ఎంట్రన్స్ వద్దే ఆగిపోవల్సి వచ్చింది. కేంద్ర పారా మిలటరీ బలగా పహారా కొనసాగిస్తున్నారు. డ్యామేజ్ అయిన 20వ పిల్లర్ కు సంబంధించిన పగుళ్లను పరిశీలించడంతో పాటు కుంగిపోయిన ప్రాంతాన్ని కూడా పరిశీలించిన కేంద్ర బృందం ప్రాథమికంగా ఓ అంచానాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నివేదికలను కేంద్ర జలశక్తి విభాగానికి డ్యాం సేఫ్లీ అథారిటీకి చెందిన నిపుణులు అందించనున్నారు. సుమారు 2 గంటల పాటు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించడంతో పాటు ఫీటు వరకు కుంగిపోయిన వంతెనను కూడా గమనించిన టీం సభ్యులు కులంకశంగా అధికారులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర జలశక్తి శాఖ ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.