దిశ దశ, హైదరాబాద్:
బీజేపీ జాతీయ కార్యవర్గంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు అవకాశం కల్పించిన జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా అవకాశం కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమాక ఉత్తర్వులు విడుదల చేశారు.
