మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్

సంచలనం కల్గిస్తున్న ఘటన

దిశ దశ, ఏపీ బ్యూరో:

ఏపీ ముఖ్యమంత్రి నారా చాంద్రబాబు నాయుడును నంద్యాలలో సీఐడీ బృందం అరెస్ట్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన్ని నిందితుడిగా పేర్కొన్న సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. క్రైం నెంబర్ 29/2012,, 120)B), 166, 418, 420, 465, 468, 471, 409, 201, 109rw 34 & 37 ఇండియన్ పీనల్ కోడ్,సెక్షన్ 12, 13,(2)rw (13(1), (cr) & (d) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 1988 ఆఫ్ సీఐడి పీఎస్ ఏపీ అధికారులు 50(1) (2) సీఆర్పీసీ ద్వారా చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇచ్చారు. నంద్యాల పట్టణంలోని ఆర్ కెఫంక్షన్ హాల్ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఈ నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద అరెస్ట్ చేస్తున్నందున కోర్టు ద్వారా బెయిల్ తీసుకోవాలని కూడా ఆ నోటీసులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని సీఐడీ అధికారులు తెలిపినప్పుడు కారణమేంటో వివరించాలని చంద్రబాబు అడిగారు. పూర్తి వివరాలు రిమాండ్ రిపోర్టులో వివరిస్తామని సీఐడీ అధికారులు చెప్పినప్పటికీ చంద్రబా3బు అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ముందు సమాచారం ఇవ్వాలి కదా 304లో తాను ఏంతప్పు చేశానో చెప్పాలి కదా అని చంద్రబాబు అన్నారు. మీ లీగల్ కౌన్సిల్ కు సబ్మిట్ చేస్తామని సీఐడీ అధికారులు చెప్పినా వినకుండా మళ్లీ ఇస్తారండి… అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇప్పుడు రిమాండ్ చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. తనకు వివరాలు తెలుపుతూ నోటీసు ఇచ్చి రిమాండ్ చేయాలని తాను ఇక్కడే ఉంటానని పారిపోను అంటూ సమాధానం ఇచ్చారు. మా ప్రాసెస్ ఇదే సార్… అంటూ సీఐడీ అధికారులు సమాధానం ఇచ్చినప్పటికీ ముందు నేను అడిగిన ప్రాసెస్ చేసి అరెస్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీంతో 50(2) (2) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన తరువాత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page