దిశ దశ, ఏపీ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్కిల్ స్కాం కేసులో వేసిన స్క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం స్క్వాష్ పిటిష్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారి చేసిన కొద్ది సేపట్లోనే సీఐడీ పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విచారించేందుకు అనుమతించింది. ఆయన్ని రెండు రోజుల పాటు విచారించేందుకు సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వులను అందుకున్న తరువాత సీఐడీ అధికారులు రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏసీబీ కోర్టు కస్టడీ తీసుకున్న తరువాత సీఐడీ ఎలా వ్యవహరించాలో కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రిని విచారించాల్సి ఉంటుంది.