ప్రపంచం అంతా మనవైపు… నాలుగో దేశంగా రికార్డ్

దిశ దశ, న్యూ ఢిల్లీ:

10 వేల కోట్లు వెచ్చించడం ఎక్కడా..? కేవలం రూ. 615 కోట్ల ఖర్చు చేసి సక్సెస్ కావడం అంటే మాటలా..? తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించిన ఘనత మన వాళ్లకే దక్కుతుంది. ఆంద్రప్రదేశ్ లోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి ముచ్చటగా మూడో సారి చేసిన ప్రయోగం అద్భుతంగా సక్సెస్ అయింది. అంతరిక్ష పరిధోనల్లో అణువంత గుర్తింపు పొందిన భారత్ ఇప్పుడు సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఇప్పటి వరకు అంతరిక్ష పరిశోధనల్లో ఒక్క శాతానికే పరిమితం అయిన భారత్ చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ తో 10 శాతానికి తన షేరింగ్ ను పెంచుకుంది. ఒకే ఒక్క అద్భుతంతో అరుదైన దేశాల సరసన నిలిచింది. సాంప్రాదాయ పద్దతిలో చేపట్టిన ఈ పరిశోధన ప్రపంచ దేశాలను తలదన్నేలా చేసిందని చెప్పడంలో అతియోక్తి కాదేమో.

మూడు సార్లు వెచ్చించిన వివరాలివే…

మొదటి సారి వెచ్చించింది రూ. 386 కోట్లు కాగా, రెండో సారి చేపట్టిన ప్రయోగానికి రూ. 978 కోట్లు, మూడో సారికి రూ. 615 కోట్లు మాత్రమే వెచ్చించారు ఇస్రో శాస్త్రవేత్తలు. అయితే చంద్రుడిపై విక్రమ్ సేఫ్ గా ల్యాండ్ కావడంలో సఫలం అయిన మన శాస్త్రవేత్తలు ఖర్చు విషయంలో మాత్రం రికార్డు క్రియేట్ చేశారనే చెప్పాలి. ప్రపంచ దేశాలు చంద్రుడిపైకి చేరుకునేందుకు వేలాది కోట్లు ఖర్చు చేసినా భారత్ మాత్రం మూడు సార్లు కూడా రూ. 2 వేల కోట్ల లోపే వెచ్చించి మూడో సారి సఫలం కావడం విశేషం. అంతరిక్ష పరిశోధనల్లో అద్భుతాలు సృష్టిస్తున్న బారత శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చేపట్టిన ప్రయోగాలన్నింటి కన్నా మించి లక్ష్యాన్ని చంద్రాయన్ 3 ద్వారా అందుకున్నారు. కొన్ని దేశాలు వేలాది కోట్లు ఖర్చు చేసి చంద్రుడిపై ల్యాండ్ కావడానికి చేసిన ప్రయత్నాల్లో మాత్రం సఫలం కాకపోవడం గమనార్హం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నామని ఢంకా భజాయించి చెప్పుకున్న దేశాలను తల దన్నేలా భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నం సక్సెస్ 140 కోట్ల మంది భారతీయుల గొప్పతన్నాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పారు.

You cannot copy content of this page