దిశ దశ, హైదరాబాద్:
చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ వీక్షించేందుకు విద్యార్థుల కోసం పాఠశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. చంద్రయాన్ ల్యాండింగ్ లైవ్ కవరేజ్ టీ శాట్ లో రానున్నందన సాయంత్రం 5.20 నిమిషాల నుండి విద్యార్థులు చంద్రయాన్ ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డీఈఓలు, స్కూల్ ప్రిన్సిపల్స్ ఈ ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతో రోజూ సాయంత్రం 4.45 గంటలకు ఇంటి బాటపట్టనున్న విద్యార్థులు బుధవారం సాయంత్రం మాత్రం ఆలస్యంగా స్కూళ్ల నుండి బయలుదేరుతారు.
Disha Dasha
1884 posts
Next Post