ధర్నా ప్లేస్ మార్చుకోండి: ఢిల్లీ పోలీసులు
మహిళా బిల్లు అమలు చేయాలన్న డిమాండ్ చేస్తూ శుక్రవారం భారత జాగృతి చేపట్టాల్సిన నిరసనకు ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ధర్నా వేదికను వేరే చోటకు మార్చుకోవాలని పోలీసులు సూచించడం గమనార్హం. ఈ నిరసనకు సంబందించిన అనుమతులు ఇప్పటికే కవిత తీసుకున్నప్పటికే ఈ రోజు వేదిక మార్చుకోవాలని పోలీసులు చెప్పడం గమనార్హం. కొద్దిసేపట్లో జంతర్ మంతర్ లోని ధర్నా వేదిక వద్దకు వెల్తానని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. యదాతథంగా ధర్నా ఉంటుందని, ఢిల్లీ పోలీసులు ఎందుకు చెప్పారో తెలియదని అన్నారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నానని వ్యాఖ్యానించిన కవిత అనుకున్న సమాయానికి మాత్రం ధర్నా కొనసాగి తీరుతుందన్నారు.