కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత…. ఎమ్మెల్యేపై టమోటాలు

దిశ దశ, హన్మకొండ:

హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకుకు, కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో సమావేశం గందరగోళంగా మారింది. గ్రామసభకు హాజరైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు టమోటాలు విసరగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమై ఇరు పార్టీల నాయకులను నియంత్రించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో ప్రజా పాలన గ్రామసభ నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వెల్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమోటాలు, కోడిగుడ్లు విసరడంతో రసాభసాగా మారింది. గ్రామసభకు హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు ఇవ్వడంతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రజలకు అన్ని రకాల ఫలాలు అందుతున్నాయని, బీఆర్ఎస్ హయాంలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నాయకులను కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్రామసభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకోవడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు.

రక్షణ వలయం…

గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డిపై టమోటాలు విసరడంతో అలెర్ట్ అయిన ఆయన అంగరక్షకులు, పోలీసులు ఎమ్మెల్మే చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే కౌశిక్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసగించారు.

You cannot copy content of this page