దిశ దశ, అంతర్జాతీయం:
దాయాది దేశంలో అసలేం జరుగుతోంది. ఆర్థిక మాంద్యం స్వైర విహారం చేస్తోందా..? అండర్ వరల్డ్ డాన్ లే టార్గెట్ గా అగంతకులు స్కెచ్ వేస్తున్నారా..? ఏక కాలంలో పాకిస్తాన్ అతలాకుతలం అవుతున్న తీరు అందరిని ఆశ్చర్చపరుస్తోంది. మరో వైపున అక్కడి ఇంటర్ నెట్ సేవలు కూడా నిలిపివేయడానికి కారణం ఏంటీ.? ఇఫ్పుడిదే చర్చ అంతర్జాతీయ సమాజంలో సాగుతోంది.
విమానాల రద్దు…
పాకిస్తాన్ లో నెలకొన్న ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా అయితే స్పష్టం అవుతోంది. సోమవారం ఏకంగా 26 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసుకోవడం గమనార్హం. ఇంధనం కొనుగోలు చేసే ఆర్థిక పరిస్థితి కూడా లేకపోవడం వల్లే విమానాలు రద్దు చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపున అక్కడి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 50 ఏళ్లకు పైబడిన వారినే ఎయిర్ హోస్టెస్ లుగా తీసుకోవాలని నిర్ణయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపున అక్కడి ఎయిర్ లైన్స్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితుల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ జాతీయ జెండాలను తాలిబన్లు అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంటర్ నెట్ సేవలను మొత్తం పూర్తి స్థాయిలో నిలిపివేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ సీక్రెట్ న్యూస్ ఏజెన్సీలు మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ లో జరుగుతున్న విషయాలు బయటకు రాకుండా ఎంత జాగ్రత్త పడ్డప్పటికీ బాహ్య ప్రపంచానికి మాత్రం అక్కడి జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి.
68వ జన్మదిన వేడుకలకు ముందే…
మరో వైపున మూడు రోజుల క్రితం విష ప్రయోగంతో ఆసుపత్రి పాలైన ‘డి’ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం తన 68వ జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కు పాకిస్తాన్ కు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వనించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనపై విష ప్రయోగం చేయడం సంచలనంగా మారింది. మరో వైపున అక్కడి మరో మాజీ క్రికెటర్, దావూద్ ఇబ్రహీంకు సమీప బంధువు కూడా అయిన జావెద్ మియాందాద్ తో పాటు అతని కుటుంబాన్ని హౌజ్ అరెస్ట్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్న కరాచీలోని ఆగాఖాన్ ఆసుపత్రి నుండి సోమవారం మద్యాహ్నం ఐదు వాహనాలు ప్రత్యేకంగా బయలుదేరాయని అందులో ఒఖ డెడ్ బాడీని తరలించారని కూడా ప్రచారం జరుగుతోంది. మరో వైపున లష్కర్ ఏ తోయిబా హబిబుల్లా అలియాస్ భోలా ఖాన్ ను కూడా అగంతకులు హత్య చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
సైనికులపై దాడి…
పాకిస్తాన్ సైనికులపై కూడా దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బారా ప్రాంతంలో పష్టూన్ కు చెందిన వారు జరిపిన దాడిలో ఇద్దరు పాక్ సైనికులు మరణించినట్టుగా తెలుస్తోంది. తాలిబాన్ మద్దతుతో కార్యకలాపాలు కొనసాగించే పష్టున్ ఫైటర్స్ అక్కడి కార్యాలయం నుండి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకెళ్లడంతో పాక్ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోందని కూడా పలు వార్త సంస్థలు పేర్కొంటున్నాయి. మొత్తంగా మాత్రం పాకిస్తాన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్టుగా స్పష్టం అవుతోంది. అయితే పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి పూర్తి వివరాలు తెలియజేస్తుందా లేదా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.